• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Unika ( Chennamaneni Swiya Charitra)

Unika ( Chennamaneni Swiya Charitra) By Ch Vidyasagar Rao

₹ 1000

అంత్యోదయ కార్యక్రమం.....

అట్టడుగు స్థాయిలో ఉన్న చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలనేది దీని ఉద్దేశం. నేను దీనిని నా స్తోమతను బట్టి మనసా వాచా కర్మణా ఆచరించాలనే దృఢ సంకల్పాన్ని తీసుకున్నాను. ఈ చింతనలో భాగంగానే గిరిజనుల అభివృద్ధికి నేను ఎమ్మెల్యేగా, ఎం.పి.గా, మహారాష్ట్ర - తమిళనాడు గవర్నరుగా ఉన్నప్పుడు ఎన్నో చర్యలను ధైర్యంగా, సమర్థంగా తీసుకోవడం జరిగింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షెడ్యూల్ ప్రాంతాలలో నిరుపయోగంగా మారుతున్న యాక్ట్ 1 అఫ్ 70ని సమర్థంగా అమలు చేసి గిరిజన ప్రాంతాలలో ఉన్న జల్-జమీన్-జంగల్ను ఆక్రమణల నుంచి విముక్తి కలిగించి గిరిజనులకే దక్కే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇందులో రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీ పి.వేణుగోపాల్ రెడ్డి గారి పాత్ర గణనీయమైంది. ఈ ప్రాంతాలలో ఎన్నో మైనింగు ప్రాజెక్టులు అక్రమంగా నిర్మాణం అవుతున్నాయని శాసనసభలో లేవనెత్తి నిర్మాణాలను ఆపగలిగాము. ఎన్ని ఆటుపోట్లు, ఆటంకాలు ఎదురైనా వెనుతిరగకుండా గిరిజన ప్రాంతాల ప్రజల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. విజయాలను కూడా సాధించాం.

నేను గవర్నర్ అయిన తరువాత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్కు అనుగుణంగా మహారాష్ట్రలో ఉన్న గిరిజనులకు బాసటగా నిలవడానికి చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాను. వీటిని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో అమలు చేయడానికి "వనవాసి కళ్యాణ్ ఆశ్రమం" వారు. కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఈ కార్యక్షేత్రంలో పనిచేస్తున్న ఎన్జిఓలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేసారు.

నేను గవర్నర్ గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో తీసుకున్న మూడు ప్రధాన కార్యక్రమాల గురించి ఈ దిగువన ప్రస్తావిస్తున్నాను:...............................

  • Title :Unika ( Chennamaneni Swiya Charitra)
  • Author :Ch Vidyasagar Rao
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6153
  • Binding :Hard Binding
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :441
  • Language :Telugu
  • Availability :instock