మాయ
ఏ ఉపేక్ష చేతనో తెలియదు కానీ
ఈరాత్రిలోకి నడిచిరావడానికి
నాకు అనుమతి లభించింది.
ఏ కారణాంతరాలను లక్ష్యించని.
ప్రేమ వల్ల
తర్కాన్ని ఏనాడో విడిచివచ్చాను.
ఖడ్గయోధుల వలె కలహించే
బహిరంతర ఘర్షణ
తప్పించుకున్న వాళ్ళు ఒక్కరూ ఎదురుపడలేదు.
మాయ చేత కప్పబడిన మన దేహాలు
ఈ వలయాల చిక్కువడి
నా నించి నీవు
నీ నుంచి నేనూ ప్రసరించి
ఏ ఆనంద ధామాలకి కళ్ళు తెరిచామో.
ఘడియయైన నిలవని దాని పేరేమిటో
నీకైనా జ్ఞాపకముందా.............