• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Upanishtprasangamulu Brihadaranyakopanishat

Upanishtprasangamulu Brihadaranyakopanishat By Sadguru Dr K Sivanandamurty

₹ 250

మొదటి ప్రసంగము

5.11.1976

జనక మహారాజు మహాజ్ఞాని. గొప్ప కర్మిష్ఠి, స్వధర్మాన్ని చక్కగా పరిపాలించిన వాడు. ప్రజలకు ప్రభువుగా రాజధర్మాన్ని చక్కగా అవలంబించినవాడు. యజ్ఞములచేత సమస్త దేవతలను సంప్రీతులను చేయగలిగినవాడు, చేసినవాడు. యజ్ఞక్రతువులద్వారా ఏ ఊర్ధ్వలోకములు ఉన్నాయని శాస్త్రములు చెప్పుతున్నాయో, వాటినన్నిటినీ సంపాదించి పెట్టుకున్నాడు. దేహాంతరము తరువాత, స్వర్గాది లోకద్వారములు ఆయన కొరకు తెరచుకొని ఉన్నాయి. ఊర్ధ్వలోకములను కర్మ ద్వారా సాధించటమేకాక, ఉపాసనద్వారా సాధించటమన్న విషయాన్ని జనక మహారాజు తెలుసుకున్నాడు. ఆ మార్గములన్నీ ఈ ఉపనిషత్తు చెప్పినది. స్వర్గాది లోకములన్నీ కేవలం యజ్ఞాది కర్మలవల్లనే కాక, ఉపాసనా విధానంలో ఎలా సంపాదించుకోవలెనో చెప్పటమన్నది ఈ బృహదారణ్యక ఉపనిషత్తుకు, ఇతర ఉపనిషత్తులకూ ఉన్న ప్రధాన వ్యత్యాసము.

మానవుని శరీరము ఇంద్రియాత్మకము. ఇంద్రియములకన్నింటికీ వాటివాటి అధిష్టాన దేవతలున్నారు. ఈ దేవతలందరూ ఊర్థ్వలోకస్థులు, ఆయాలోకములకు అధిపతులు. భూలోకములో, ఇంద్రియాత్మకమైన శరీరములు కలిగిన మానవుల ఇంద్రియములలో ప్రవేశించి, ఆయాకర్మలను చేస్తూ ఉంటారు. వారి స్వస్థానములు ఊర్ధ్వలోకములు. ఆయాదేవతలను, ఆయా ఇంద్రియముల అధిష్ఠాన దేవతలుగా, ఆయాకార్యములు ఎట్లా నిర్వహిస్తున్నారో తెలుసుకొని, తద్వారా ఆ దేవత ఏ ఊర్ధ్వలోకమునకు చెందినవాడో, దేనికి అధిపతో, అట్లాగే వారి స్వస్థానమును తాను సాధించుకోవటంచేత, ఆ లోకములందుండే ఉత్తమస్థితిని, ఆ జీవుడు ఇక్కడే పొందుతాడని చెప్పటానికి, ఎన్నో విధానములను, ఎంతో చమత్కారంగా, ఈ ఉపనిషత్తు చెప్పింది. ఇతర ఉపనిషత్తులకూ దీనికీ, ఇదే ప్రధానమైన భేదము.

జనక మహారాజునకు ఇదంతా ఒక్కరు చెప్పలేదు. ఒక్కొక్క మహర్షి వచ్చి తాను..............................

  • Title :Upanishtprasangamulu Brihadaranyakopanishat
  • Author :Sadguru Dr K Sivanandamurty
  • Publisher :Sivananda Supadha Foundation
  • ISBN :MANIMN5629
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2023
  • Number Of Pages :216
  • Language :Telugu
  • Availability :instock