కూకటివేళ్లతో సహా హిందూత్వను పెకిలించివేద్దాం
మనిషి ఒక్కడే ఒంటరిగా జీవించలేడు. ఇది మానవ నైజం. ప్రజల ఒకరిమీద ఒకరు పరస్పరం ఆధారపడి జీవిస్తారు. ఈ స్వభావం కేవలం మనుషులకు మాత్రమేకాదు, చరాచర జీవులకు అన్నింటికీ వర్తిస్తుంది. పరస్పరం ఆధారపడే తీరునుబట్టి, ఒకరిపట్ల మరొకరు ప్రవర్తించే విధానాన్నిబట్టి, అనేక సమూహాలుగా, తెగలుగా, కులాలుగా, సమాజాలుగా, మతాలుగా, జాతులుగా, ఇంకా అనేక విధాలుగా గుర్తింపు పొందుతారు. ఒకే సమూహంలోని సభ్యుల మధ్య లేదా వివిధ సమూహాల మధ్య వైరుధ్యాలు తలెత్తుతాయి. ఆ క్రమంలో ఒక సమూహం అనేక సమూహాలుగా విచ్ఛిన్నం కావొచ్చు. లేదా అనేక సమూహాలు మమేకమై ఒకటిగా ఏర్పడవచ్చు. ఈ గతితార్కిక ధోరణి ఎప్పటి నుంచో ఆచరణలో వున్నది. తమను తాము రక్షించుకోవడానికి, తమ ఆధిపత్యాన్ని స్థాపించడానికి సమూహాలు ఒకరితో ఒకరు ఘర్షణ పడటమే కాదు, ఇతరులను నాశనం చేయడానికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యతను కూడా ఇస్తాయి. ఇది మానవ జీవితంలో అనివార్యమైన పార్శ్వంగా మారిపోయింది.
అలాంటి చర్యల కారణంగా, ఆ సమూహ ప్రయోజనాల కోసం, ప్రతి సమూహం నియమాలను, జీవన సూత్రాలను నిర్వచించుకొని, వాటికి అనుగుణంగా పనిచేస్తాయి. ఒక తరం నుంచి మరో తరం ఈ నియమాలను అమలు చేస్తూ..................