• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

UPSC Shikaragram Cherukundam ( Scaling Mount UPSC)

UPSC Shikaragram Cherukundam ( Scaling Mount UPSC) By Sajjan Yadav

₹ 399

నాంది
 

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్ష ఎదుర్కున్న హీరోలు

అమ్మా, నేను కలెక్టర్ అయ్యాను

ప్రతి సంవత్సరం, పది లక్షల కంటే ఎక్కువ మంది భారతీయ యువత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్), అలాగే ఇతర ప్రధాన సివిల్ సర్వీసులలో చేరడానికి, గౌరవనీయమైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సిఎస్ఇ) లో ఉత్తీర్ణత సాధించాలనే తమ కలను సాకారం చేసుకోవాలనుకుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, కఠినమైన, పోటీ పరీక్షల్లో ఒకటి.

మూడు దశాబ్దాల క్రితం, ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి అవసరమైన భారీ సన్నాహాల్లో మునిగిపోయిన ఔత్సాహికులలో నేనూ ఒకడిని. హర్యానాలో అతి సాధారణ నేపథ్యం నుండి వచ్చిన నాకు పాఠశాల రోజుల నుంచే ఐ.ఎ.ఎస్ కావాలనే కల ఉండేది. అకడమిక్స్ లో యూనివర్శిటీ గోల్డ్ మెడల్ సాధించడం నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అయినా, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులకి ఆప్షనల్ సబ్జెక్టుల్లో వస్తున్న అత్యధిక మార్కులు, ఆ కథనాలు నన్ను కలవరపెట్టాయి.//////////

  • Title :UPSC Shikaragram Cherukundam ( Scaling Mount UPSC)
  • Author :Sajjan Yadav
  • Publisher :Manjul Publishing House
  • ISBN :MANIMN6385
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :303
  • Language :Telugu
  • Availability :instock