మీరు ఉద్యోగానికి వెళ్ళడానికి భయపడుతున్నారా? చాలా అలసిపోయి, చింతతో, కుంగిపోయిన భావనకు లోనవుతున్నారా? మీ కలలను మీరు వదులుకున్నారా? ఆనందకరమైన, విజయవంతమైన జీవితానికి మార్గం మీ వైఖరితోనే మొదలవుతుంది ఆ వైఖరి మీ నియంత్రణలోనే ఉంటుంది. మీ వైఖరి ప్రతికూలమైనా, సానుకూలమైనా లేక ఆ రెంటి మధ్యలో ఉన్నా, ప్రేరణాత్మక వక్త,
కోచ్ జెఫ్ కెల్లర్ మీలో గల సంభావ్య శక్తులను నియంత్రణలోకి తెచ్చుకుని, వాటిని వెలికి తీసేందుకు మూడు శక్తిమంతమైన చర్యలను చూపుతున్నారు:
• ఆలోచించండి! విజయం అనేది మెదడులో ప్రారంభం అవుతుంది. మీ వైఖరి శక్తి మీ విధిని మార్చవచ్చు.
మాట్లాడండి! మీ మాటల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీరు మాట్లాడే తీరే మిమ్మల్ని మీ లక్ష్యాల దిశగా నడిపించగలదు.
• చర్య తీసుకోండి! పని చేయకుండా కూర్చోకండి.
మీ కలలను వాస్తవంలోకి మార్చేందుకు చురుకుగా చర్యలు తీసుకోండి. త్వరలోనే, మీకు శక్తి సమకూరి, నూతన అవకాశాలను చూడగలుగుతారు. మీరు ప్రతికూలతను ఎదుర్కొని, మీకే ప్రత్యేకమైన ప్రతిభలను అభివృద్ధి చేసుకోగలుగుతారు. పని ప్రదేశంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీకు కావలసినదల్లా మీ వైఖరిని, మీ జీవితాన్ని మార్చగల ఈ దశలవారీ కార్యక్రమమే!
- జెఫ్ కెల్లర్