• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vaivahika Jeevitam SaSastriya Jataka Pontana

Vaivahika Jeevitam SaSastriya Jataka Pontana By Pappu Rajeswari

₹ 160

అధ్యాయం 1
 

ఉపోద్ఘాతము

జ్యోతిషం ఒక మహా శాస్త్రం అలాగే ఒక కళ కూడా. వాస్తవానికి పరిశోధనల ద్వారా, సాహిత్య లభ్యతతో శాస్త్రాలు అభివృద్ధి చెందినప్పటికీ, ఈ అభివృద్ధిలో కళ కూడా ప్రధానంగా ఉంది. మూలగ్రంధాలు మరియు ఎక్కువ పరిశోధనలు అందుబాటులో లేని కాలంలో జ్యోతిష ఫలిత విశ్లేషణలలో ఖచ్చితమైన గణిత గణనతో పాటు వాక్ సామర్థ్యాన్ని తదనుగుణంగా ప్రదర్శించారు. ఈ విధంగా చాలా మంది జ్యోతిష్కులు తమ కృషితో ఈ శాస్త్రాన్ని సుదీర్ఘంగా అద్భుతంగా ఫలిత విశ్లేషణ కావించారు. తద్వారా మరిన్ని గణనలు మరియు కొత్త సూత్రాలు వెలుగులోకి తెచ్చారు. కేవలం రాశి, రాశి చక్రంలోని గ్రహాల ఆధారంగా ఖచ్చితమైన ఫలితాలను చెప్పలేం. కాని ఫలితాలు చెప్పడానికి వివిధ పద్ధతులు నియమాలున్నాయి, వాటిని ఆధారంగా తీసుకొని చెప్పడం అంత సులభం కాదు.

వివాహాము కుదిర్చే క్రమంలో వధూవరుల జాతకాలను సరిపోల్చడానికి చాలా పద్ధతులు ఉన్నప్పటికీ, ఏ పద్ధతి ఇప్పటివరకు సరియైనది అని నిర్ణయించబడలేదు. అయితే వివాహాలు స్వర్గంలో నిర్ణయింపబడుతాయి అనే నానుడి ఉన్నప్పటికీ భారత దేశంలో వివాహానికి ముందుగా వధూవరుల జాతకాలలో పొంతన ఉన్నది లేనిది తెలుసుకొనుటకు జ్యోతిష్కుని సంప్రదిస్తారు. దీని ఫలితంగా భారతదేశంలో వివాహాలు విజయవంతమౌతున్నాయి.

సాంప్రదాయ జ్యోతిష పద్దతి (నిరయణ)లో వధూవరుల జాతకాలను సరిపోల్చుటకు చంద్రుడు ఉన్న జన్మ రాశి మరియు చంద్ర నక్షత్రమును మాత్రమే పరిగణనలోకి తీసుకొని మిగతా విషయాలను పట్టించుకొనరు. వివిధ జ్యోతిష పుస్తకాలలో మరియు పంచాంగంలలో వధూవరుల జాతక పొంతన విషయమై...............

  • Title :Vaivahika Jeevitam SaSastriya Jataka Pontana
  • Author :Pappu Rajeswari
  • Publisher :Pappu Rajeswari
  • ISBN :MANIMN5465
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :71
  • Language :Telugu
  • Availability :instock