నిర్వాణ తలం
అలా విన్నా ఒకప్పుడు నేను. ఆ భగవానుడు ఉండేవాడప్పుడు శ్రావస్తిలో... ఓ ప్రాతఃకాలంలో ఆ భగవానుడు భిక్షువలువలను ధరించాడు, భిక్షాపాత్రను తీసుకున్నాడు, భిక్షాన్ని స్వీకరించేందుకు శ్రావస్తీ మహానగరానికి చేరుకున్నాడు.
ఆహారాన్ని భుజించి తన భిక్షా ఆవృత్తి నుండి వెనుదిరిగి వచ్చేసిన తరువాత, భగవానుడు భిక్షాపాత్రనూ, వలువలనూ యథాస్థానాల్లో పెట్టేసి, చేతులూ కాళ్ళూ కడుక్కుని, ఆయన కోసం తయారుచేసి ఉన్న ఆసనం మీద కూర్చుని, పద్మాసనం వేసుకుని, నిటారుగా శరీరాన్ని నిలిపి, తన ముందున్న స్థలం మీద దృష్టిని నిలిపి ఉంచాడు. అప్పుడు సన్యాసులెందరో వచ్చి ఆ భగవానుణ్ణి దర్శించుకుని, ఆయన పాదాలకు తమ తలలు ఆనించి నమస్కారాలను సమర్పించుకుని, ఆయన చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసి, వెళ్ళి ఓ ప్రక్కన కూర్చున్నారు.
ఆ రోజుల్లో మహాప్రాశస్త్యాన్ని పొంది ఉన్న సుభూతి ఆ సమావేశానికి వచ్చి కూర్చున్నాడు. ఆ తరువాత ఆయన తన ఆసనం మీద నుంచి లేచి, తన ఉత్తరీయాన్ని తీసి, ఓ భుజంమీదకు వేసుకుని, కుడిమోకాలును భూమిమీద నిలిపి, చేతులు జోడించి,
భగవానుడి ముందు వినమ్రుడై ప్రణమిల్లి, భగవానుడితో అన్నాడు. అద్భుతం! భగవాన్ ఇది పరమాద్భుతం! ఓ సుగతుడా, గతించిన బోధిసత్వులెందరో మహాజీవులెందరో, పొందే ఉన్నారు తథాగతుని మహాసహాయాన్ని...
ఎలా భగవాన్? బోధిసత్వుని వాహనంలో బయల్దేరి వెళ్ళినవాడు. అప్పుడెలా నిలబడాలి, ఎలా పురోగమించాలి. తన ఆలోచనలను..............