• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vakra Rekha

Vakra Rekha By Viswanadha Satyanarayana

₹ 150

సూటిగా చెప్పాలంటే వక్రరేఖకథ యిలా ఉంటుంది.

ఢిల్లీలో గంగూ అనే బ్రాహ్మణుడు. అతని వద్ద హసన్ (జాఫరా ఖాన్ అని మరో పేరు) అనే మహమ్మదీయ పనివాడు. హసన్ జాతకాన్ని పరిశీలించిన గంగూ, అతను చాలా ఉన్నతస్థాయికి చేరతాడని గ్రహించాడు. తన పలుకుబడితో ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ వద్ద చేర్చాడు. ఫౌజులో హసన్ అంచెలంచెలుగా ఎదిగి సైన్యాధికారులలో ఒక పెద్ద అయ్యాడు. దక్షిణభారతానికి దండయాత్ర కోసం వచ్చి, నేటి కర్ణాటకలోని కలబురిగి (గుల్బర్గా)లో స్వతంత్రరాజ్యస్థాపన చేశాడు. గంగూ మీద గౌరవంతో తన పేరు చివర 'గంగూ' చేర్చుకొని హసన్ గంగూ అయ్యాడు. తన వంశానికి 'బ్రాహ్మణ' అనే అర్థం వచ్చే 'బహ్మన్' (బహమని, బహమనీ, బహ్మనీ, బామినీ అనే స్పెల్లింగులతోనూ రాస్తారు) అనే పేరు పెట్టుకొన్నాడు. గంగూని తనవద్దకు రప్పించుకొన్నాడు. ఉభయవంశాలవారు ఎప్పుడూ స్నేహంగా ఉండేటట్లు నిబంధన పెట్టుకొన్నారు.

రక్షణ కోసం, అంతఃకలహాలనుండి మనశ్శాంతి కోసం కాలక్రమంలో రాజధాని గుల్బర్గా నుండి బీదర్కు మారింది. హుమాయూన్ సుల్తానుగా ఉన్నప్పుడు గంగూ వంశస్థుడు హరశాస్త్రి. ఖ్వాజా మహమూద్ గవాన్, ఖ్వాజా మహమ్మద్ జహాన్ అనే యిద్దరు హుమాయూన్ మంత్రులు. నిజాంషా, మహమ్మదా అనే ఇద్దరు హుమాయూన్ కుమారులు. హుమాయూన్ చనిపోతూ కొడుకులను యిద్దరు మంత్రులకు, రాణికి అప్పగించిపోయాడు. కొత్తసుల్తానుగా అభిషిక్తుడైన నిజాంషాకి గవాన్ దగ్గర; తక్తు ఎక్కడానికి ఉవ్విళ్ళూరే మహమ్మదాకి జహాన్ చేరిక.

మాయోపాయంతో నిజాంషాను ఖూనీ చేయించి, మహమ్మదాను గద్దెనెక్కించాడు జహాన్. అంతేకాదు, నిజాంషా హత్యను హరశాస్త్రి మెడకు చుట్టబోయాడు. ఈ కుట్రను గుర్తించిన నర్గీస్ బేగం (హుమాయూన్ రాణి), మంత్రి గవాన్ అంతే మాయోపాయంతో జహాన్ ను చంపించారు. రాణి మంచితనం మీద బీదర్ను విడిచి కొండపల్లికి వెళ్లిపోయాడు హరశాస్త్రి....................

  • Title :Vakra Rekha
  • Author :Viswanadha Satyanarayana
  • Publisher :Muni Manikyam Narasimharao Sahithi Peetam
  • ISBN :MANIMN5281
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :140
  • Language :Telugu
  • Availability :instock