• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Valmiki Ramayanam vol 1 & 2

Valmiki Ramayanam vol 1 & 2 By Uppuluri Kameswara Rao

₹ 350

వాల్మీకి రామాయణము

బాల కాండ

పవిత్రమైన వాల్మీకిమహర్షి ఆశ్రమానికి ఒకరోజు దేవర్షి నారదుడు వచ్చాడు.

తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్,

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్.

వచ్చిన నారదుడు తపస్స్వాధ్యాయనిరతుడు. ' వాగ్విదాంవరుడు. * మునిపుంగవుడు. '

ఆహ్వానించి పూజించిన వాల్మీకి తపస్వి.

వాల్మీకి నారదుడిని ఇలా పరిప్రశ్నించాడు.

ఈ ప్రశ్నతోనే రామాయణమహాకావ్యం ప్రారంభం అవుతుంది.

"మహర్షీ! ఇప్పుడు, ఈ లోకంలో ఎవడైనా మానవుడు

ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు, దృఢవ్రతుడు, సచ్చరిత్రుడు,

సర్వప్రాణికోటికీ హితుడు, విద్వాంసుడు, సమర్థుడు, సదా ప్రియదర్శనుడు,

ఆపైన ధైర్యవంతుడు, తేజోవంతుడు, జితక్రోధుడు, అసూయలేనివాడు,

కోపించి రణరంగంలో నిలిస్తే దేవతలకు కూడా భయం కలిగించేవాడు - ఉన్నాడా?

మీరు సకలలోకాల సమాచారం తెలుసుకోగల సమర్థులు కదా! అటువంటి మానవుడు ఉంటే మీకు తప్పక తెలుస్తుంది.

  1. తపస్సు, వేదాధ్యయనం చెయ్యడంపట్ల ఆసక్తి కలవాడు.
  2. మాట్లాడే విధానం తెలిసినవారిలో శ్రేష్ఠుడు.
  3. మునులలో, గొప్పవాడు.
  4. యోగ్యుడైన శిష్యుడు ఉత్తముడైన గురువుని సమీపించి, వినమ్రుడై, జ్ఞానం గురించి ప్రశ్నించడాన్ని ప్రశ్నించడం అంటారు.................

  • Title :Valmiki Ramayanam vol 1 & 2
  • Author :Uppuluri Kameswara Rao
  • Publisher :Sri Jayalakshmi Publications
  • ISBN :MANIMN5667
  • Binding :Papar Back
  • Published Date :2016 3rd Print
  • Number Of Pages :790
  • Language :Telugu
  • Availability :instock