సూక్ష్మం సుందరం - అరుదు అపురూపం
ప్రకృతిలో స్వేచ్ఛగాను, సువిశాలంగాను విస్తరించి వ్యాపించే మహావృక్షాలను నియంత్రించి అరచేతిలో సైతం ఇముడ్చుకోగల సూక్ష్మరూపంలో మలచగలగడం
అతి ప్రాచీన కాలంలో పుట్టి అపురూపమైన కళగా రూపొందిన వామన వృక్షాల పెంపకం పట్ల నేటి ఆధునిక సమాజానికి విపరీతమైన ఆకర్షణ ఉంది. శరవేగంతో సాగిపోతున్న నాగరిక మానవుని యాంత్రిక జీవనయానం మనోజ్ఞమైన ప్రకృతి నుండి అతడిని రోజు రోజుకూ దూరం చేస్తోంది.
దూరమైపోతున్న ప్రకృతికి చేరువ కావాలన్న తపన - నిర్మలమైన ప్రకృతి సాంగత్యంలో నిశ్చలమైన అలౌకిక ఆనందాన్ని పొందగలనన్న విశ్వాసం పుష్పాలంకరణ, వామనవృక్షాల పెంపకం మొదలైన విభిన్న కళారూపాల వ్యాప్తికి దోహదం చేస్తోంది. అవ్యక్తమైన ఆధ్యాత్మిక చింతనను అందంగా అభివ్యక్తం చేసే `ఇకీబనా' (పుష్పాలంకరణ) నుండి లభించే ఆనందం పరిమితం కాని నిత్యనూతనంగా మన మనసులనలరించే సజీవ శిల్పాలైన వామన వృక్షాలు కలుగజేసే ఆనందం నిరంతరం!
పుష్పాలంకరణలాగే వామనవృక్షాల పెంపకం కూడా ఒక కళగా అందరూ అంగీకరించినదే! అందుకే శాస్త్రీయమైన ఆ కళలు నిష్ణాతులైన గురువుల దగ్గర అభ్యసిస్తే గాని అలవడవన్న అపోహ మనలో చాలమందికి ఉంది...................