వంశవృక్షం వెండితెర నవల ప్రచురణ నేపథ్యం
వరప్రసాదొడ్డిగారు 2022, సెప్టెంబర్లో ఒకరోజున ఫోన్ చేసి, 'ఎందుకో శ్రీరమణగారిని చూద్దామనిపిస్తున్నది. ఇద్దరం వెళ్లాం. మీకెప్పుడు వీలయితే అప్పుడు హైదరాబాద్ రండి' అన్నారు, ఉపోద్ఘాతం ఏమీ లేకుండా.
శ్రీరమణగారిని చూసి చాలా రోజులయ్యింది. వరప్రసాదొడ్డి గారు కూడా రమ్మంటున్నారు. పోదామనిపించింది. వారికి కుదిరి నప్పుడు నాకు కుదరక; నాకు కుదిరినప్పుడు వారికి కుదరక, మొత్తానికి 29. 10. 2022 నాడు శ్రీరమణగారింటికి వెళ్లాము. సైదోడుగా శ్రీ వాసిరెడ్డి విక్రాంత్, శ్రీ మారెళ్ల వెంకయ్య, 'ఆంధ్రభారతి' శాయిగారు. శ్రీరమణగారు అంకితవాక్యాలలో చెప్పిన మలయమారుతం నేను, మామిడిచిగుళ్లు మిగతా ముగ్గురు మిత్రులు.
సుమారు గంటన్నర గడిపాము. శ్రీరమణగారు మాట్లాడ గలిగినంతసేపు మాట్లాడాము. వరప్రసాద్ రెడ్డిగారు ముందుగా సంసిద్ధులై వచ్చిన ప్రకారం శ్రీరమణగారిని సత్కరించారు.
వరప్రసాద్ గారు కారెక్కుతున్నప్పుడు ఇంకా ముద్రితమవ వలసిన శ్రీరమణగారి రచనల ప్రస్తావన వచ్చింది. 'బాపుగారు తీసిన త్యాగయ్య, వంశవృక్షం చలనచిత్రాల నవలలు, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ధారావాహికగా వచ్చిన చిలకలపందిరి
శ్రీరమణ