కాస్త తెలుపుకుందామని
ఇన్ని పేజీలు రాశాక 'నా మాట' ఏం రాయాలా అని.
1994 నుంచి పత్రికల్లో పని చేస్తున్నాను. ఎవరికైనా సున్నం రాసే వార్త రాసిన ప్పుడు మాత్రమే వెంటనే రెస్పాన్స్ తెలిసేది... అది కూడా ఎడిటర్కి కంప్లయింట్
జీవితం 'ఫీచర్స్'లో గడించింది కనుక వ్యాసమో, కథో రాస్తే ల్యాండ్లైన్ రోజుల్లో ఒక కాల్ వస్తే గొప్ప. రాసి ఎదురు చూస్తే, పాఠకులకు నచ్చితే వారం తర్వాత ఒకటి రెండు కార్డుముక్కలు అందేవి. ఏదో ఒక సాహిత్యసభ దగ్గర ఎదురు పడినప్పుడు స్నేహితులు మొన్న నువ్వు రాసింది బాగుంది అంటే వినేవాళ్లం. తర్వాత్తర్వాత ఫోన్ నంబర్లు ఇవ్వ మొదలుపెట్టారుగాని అది గాలికి పోయే స్పందన. లిఖిత స్పందనకు సరిసాటి కాదు.
ఫేస్బుక్ వచ్చాక అది 'తక్షణ లిఖిత స్పందనా వేదికగా గిరాకీ సంపాదిం చుకుంది. కవిత్వాన్ని, వ్యాఖ్యానాన్ని, ఆలోచనను, అభిప్రాయాన్ని, కథను, తిట్టును, పొగడ్తను ఫేస్బుక్ ఎవరో ఒక ప్రేక్షకుడు ఎప్పుడూ కూచోనుండే వేదిక మీదకు తెచ్చిపెట్టే సాధనం అయ్యింది. ప్రదర్శన మొదలైన వెంటనే ప్రతిస్పందన తెలిసిపోతుంది. చేవ ఉంటే ప్రతిస్పందన కొనసాగుతూనే ఉంటుంది. షేర్లు అవుతున్నాయంటే షోలు పెరుగుతున్నట్టు. కామెంట్లు పెరుగుతున్నాయంటే ప్రేక్షకులు.................