వరదహస్తం
వేసవికాలం కావడంతో జనులు భానుడి ప్రకాశాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే ఎండ తీవ్రత అధికంగా ఉంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులతో, పనులకోసం వెళ్లే ప్రజలతో త్రోవ రద్దీగా వుంది. ఉక్కపోతకు తొందరగా మెలకువ రావడంతో లేచి గడియారం వైపు చూశాడు సూర్యం. సమయం అయిదు గంటలు అయింది. తొందరగా తయారై వెళ్ళాలి. అనుకుంటూ భార్యను లేపాడు. “రంగీ లే” చూడు సమయం ఎంత అయ్యిందో? అంటూ చెప్పడంతో లేచి స్నానం చేసి వంట ముగించాలి అంటూ మెలకువ చేసుకుంది.
సూర్యం పళ్ళను బండిమీద పెట్టుకొని అమ్ముతుంటాడు. ఏ ఋతువులో వచ్చే పళ్లు ఆ ఋతువులో అమ్మడం వలన సంసారం ఒడిదొడుడుకులు లేకుండా సాగిపోతోంది. స్నానం ముగించిన సూర్యం తన బండిపై పళ్ళను పెట్టుకొని అమ్మడానికి బయలుదేరాడు. సూర్యం ఇంటికి సమీపంలోనే శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. బండితో బయలుదేరడానికి ముందు ఆలయానికి వెళ్ళి రెండు అరటిపళ్ళను దేవాలయం లోపలి అరుగుపై పెట్టి "స్వామి ఈ రోజు బోనీ బేరము మంచిగా జరగాలి ” అని మొక్కుకొని బయలు దేరాడు.
సూర్యం ప్రతిరోజు చేసే దినచర్య ఇదే మనసా, వాచా, కర్మణా దేవుడిని నమ్ముకున్నాడు. ఏ రోజైనా పళ్ళు సరిగా అమ్ముడు పోక పోయినా ఈ రోజు నాప్రాప్తం ఇంతే అంటూ సరిపెట్టుకుంటాడు. భగవంతునిపై ఉండే నమ్మకమే తనను కాపాడుతుందని విశ్వసిస్తాడు.
సూర్యంకు ఉన్న సంతానం ఒకే ఒక్క అమ్మాయి గిరిజ. గిరిజ డిగ్రీ చదువుతోంది. చదువులో చురుకైన అమ్మాయి కావడంతో దాతల సహాయంతో చదువు ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. పళ్ళను అమ్మడానికి బయలుదేరిన సూర్యంకు ఎండవేడి వలన చెమటలు పట్టడంతో ఓ అరుగుమీద కూర్చున్నాడు. ఇంతలో ఒకామె పళ్ళను కొనడానికి వచ్చింది.
" డజను ఎలా ఇస్తా వేమిటి'...................