వారాణసి వైశిష్ట్యం వందే విశ్వనాథం, వందే విశాలాక్షీం వందే గంగాం సర్వౌఘనాశినీ, వందే వారణాసీం విశ్వేశ్వరుడు, విశాలాక్షి, గంగ, కాలభైరవుడు, ఢుంఢి గణపతి, దండపాణి అనువారల సేవనమే ఒక షడంగయోగము. మనస్సును సంకల్పరహితము చేసి క్షేత్రజ్ఞుడైన పరమాత్మయందు ఏకీకృతము చేసినవాడే ముక్తుడు, యోగి కాగలడు. వామభాగమునందలి (Left) ఇడానాడితో వాయువును పూరించి దక్షిణభాగము (Right) నందలి పింగళానాడితో విడిచిపెట్టాలి. దీనిని ప్రాణాయామము అంటారు. అనంతరము వాయువును పింగళనాడితో పూరించి ఉదర దరియందు పూరించి అక్కడ కుంభకము నందుంచి తరువాత ఇదానాడి నుంచి విడిచిపెట్టాలి. కాశీవాసము మహాయోగము. గంగాస్నానము మహాముద్ర. కాశీ వీధులయందు తిరుగుటయే ఖేచరీముద్ర. దూర దూర ప్రాంతములనుండి కాశీకి వచ్చుటయే ఉడ్డీనయాన బంధము. ఎన్ని విఘ్నములు కలిగిననూ కాశీని విడువకుండా ఉండుటయే మూలబంధము. అసలు కాశీ రావడానికి ఆ విశ్వేశ్వరుని అనుగ్రహం తప్పక ఉండి తీరాలి. ఆయన అనుగ్రహము లేనిదే ఎంత ప్రయత్నించినా కాశీలో కాలుపెట్టలేము. పుణ్య, దాన, తప, యజ్ఞదుల వలన కాశీప్రాప్తి కలుగదు. ఈశ్వరుని అనుగ్రహము లేక పుణ్యకోటివలన కూడా కాశీవాసము లభించదు. మానవజన్మ దుర్లభమయినట్లే కాశీప్రాప్తి కూడా దుర్లభము. జీవి ఏదైనా మనుషులు, జంతువులు, క్రిమికీటకాదులు, పండితులు, చండాలురు అనే భేదము లేకుండా ఎవరైనాసరే కాశీ ప్రవేశించగానే కాశీ పొలిమేరలోనే వారి పాపాలు నశిస్తాయి. కాశీలో ఉత్తరవాహిని అయిన గంగ, వరుణ అసి నదుల సంగమముతో................ |