ఈ 'వారణాసి' పఠనం
వారణాసి దర్శనంతో సమానం
లోకాన్ని, తమ చుట్టూ ఉన్న సమాజాన్ని, జీవితాన్ని తమదైన అనుభవ కోణంలోంచి చూసే తరం సృజనాత్మక వ్యాసంగంలో ఆర్తి ఉంటుంది. ఆర్ద్రత ఉంటుంది. మనసులోని మాటలను, అనుభవాల పలవరింతను ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా నిసర్గమైన రీతిన అభివ్యక్తం చేయడం ఈ తరపు యువత ప్రత్యేకత. ఇలాంటి తరానికి చెందిన మిత్రుడు మామిడాల వినోద్. నిండా మూడు పదులు నిండని వయసు తనది. నిండైన ఉత్సాహంతో చరిస్తుంటాడు. నిత్య నూతనంగా చలిస్తుంటాడు. ఏకకాలంలో నాలుగు పనులను చేపట్టి నిర్వహించే సామర్థ్యం.................