నవశక స్వాప్నికుడు జయరావు
డా|| రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత
"నాది ప్రజాబలం
నేను నిరసన గళం
మార్పుకు స్వాగత పత్రాన్ని
ఈ దేశపు ముఖచిత్రాన్ని
రెపరెపలాడే జాతిపతాకాన్ని” (రుధిర సంధ్య: పుట 69)
డా. బద్దిపూడి జయరావు కవి, కథారచయిత, విమర్శకుడు. ఈయన ఇదివరకే కొత్తనెత్తురు, విశ్వమాత కావ్యాలను ప్రచురించారు. ఇప్పుడు వర్ణయుద్ధం కావ్యం ప్రచురించారు. ప్రకాశం జిల్లాకు చెందిన జయరావు పదేళ్ళు అనేక చోట్ల ఉద్యోగం చేసి, ఇప్పుడు పోటీ పరీక్షలలో పాల్గొనే అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు.
జయరావు బహుజనవాది, అంబేడ్కరిస్టు. అలాగే మార్క్సిజం మీద విశ్వాసం ఉంది. ఈయన కవిత్వంలో ఈ రెండు తాత్విక సిద్ధాంతాల నేపథ్యం కనిపిస్తుంది. అంతర్జాతీయంగా నెల్సన్ మండేలా, ఫిడెల్ క్యాస్ట్రోలను స్మరించారు. (నల్లసూర్యుడు, సోషలిస్ట్ శిఖరం) జాతీయంగా డా॥ బి.ఆర్. అంబేడ్కర్ (బహుజన బాంధవుడు) ను తలుచుకున్నారు. మేడేను గుర్తు చేసుకున్నారు. (దేశ చిత్రాలు), శ్రమ దోపిడీని నిరసించారు (అన్వేషణలో అరుణం), కులవ్యవస్థను విమర్శించారు (వర్ణయుద్ధం, నెత్తుటి గాయాలు), ఇవన్ని కలిసి.....................