• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vasikaranam 30 Veraiti Kathalu

Vasikaranam 30 Veraiti Kathalu By Mbs Prasad

₹ 150

ఛాయాచిత్రం ఛాయ

అద్భుతరస యామిని ఇంట్రో

"కథలు చెప్పుకోడానికి మాంచి అనువైన వాతావరణం ఏర్పడింది కదూ.. ముఖ్యమంత్రిణి గారు వరద ప్రాంతాలు చూడ్డానికి వచ్చి ఈ బంగళాలో ఇరుక్కు పోవడం, మందీ మార్బలం ఉన్నా ఎటు వెళ్లడానికి వీలులేక నిస్సహాయంగా ఉం డవలసిరావడం, ఇంతమందిమీ ఈ రాత్రి ఇక్కడ ఎలా గడపాలో తెలియక కొట్టు మిట్టులాడడం... తోచుబాటు కోసం కథలు చెప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్టుంది. కదూ!" అన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆచారి.

"నా మనస్సులో ఉన్నమాట ఆచారి గారు చెప్పేసారు. చిత్రంగా ఇక్కడ చిక్కడి పోయాం కదూ. బయట చూడండి, చుట్టూ నీళ్లు. ఈ బంగళాయే ఒక దీవిలా ఉంది. ఆకాశం. భూమీ కలిసిపోయినట్టున్నాయి. పైనా, కిందా ఎక్కడ చూసినా కరక్కాయ సిరా వూసేసినట్లు ఒకటే నలుపు. రాత్రి ఎనిమిదయిందో, లేదో అప్పుడే..” అని ముఖ్యమంత్రిణి అంటూండగానే, ఇంకో జర్నలిస్టు చనువు కలిపించుకుని, "సీఎమ్ గారికి కవిత్వం వచ్చేస్తోంది. ఏం మేడమ్, పుస్తకాలు బాగా చదివే అల వాటా?” అన్నారు.

నడివయస్కురాలైన ముఖ్యమంత్రిణి సిగ్గు పడ్డారు. "కాలేజీ రోజుల్లో బాగా అలవాటు ఉండేదండి. స్టూడెంటు పాలిటిక్స్లో పడిన దగ్గర్నుంచి ఆ సరదాలన్నీ వెనకబడ్డాయి. ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా సరే రాజకీయాలంటే ఫుల్ టైమ్ ఏక్టివిటీ. సాటి పొలిటీషియన్స్ గోడు వినాలి. ప్రజల కష్టాలు, కడగండ్లూ వినాలి. ఇక దాంతో మరేదీ వినడానికి టైముండదు. కానీ ఇవన్నీ విషాద గాథలే. సుఖాంతమైన కథ వినిపించడానికి మన దగ్గరకి ఎవరూ రారు. మరోరకం కథలు వినడానికీ, చెప్పడానికి కూడా తీరికేదీ?"

"మేడమ్, ఈ అనుభవం తర్వాత సస్పెన్స్ కథ విన్నట్టుగా కూడా లెక్కేసుకోండి. మనం అసలు ఈ వరదలోంచి బయట పడతామా, లేదా? బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయి, సెల్ఫోన్ సిగ్నల్స్ లేక, ఏ కమ్యూనికేషన్ అందని పరిస్థితుల్లో ఉన్న మనం ఎక్కడున్నామో బయటున్న వాళ్లకు తెలుస్తుందా, లేదా? లేక ఈలోపుగానే మనం వరదలో కొట్టుకుపోతామా?" అంటూ కాస్త వెక్కిరింతగానే మాట్లాడాడు ఓ..........

  • Title :Vasikaranam 30 Veraiti Kathalu
  • Author :Mbs Prasad
  • Publisher :Mbs Prasad
  • ISBN :MANIMN5482
  • Binding :Papar Back
  • Published Date :May, 2024
  • Number Of Pages :285
  • Language :Telugu
  • Availability :instock