మానవ శరీరము బ్రహ్మసృష్టిచే నేర్పడిన మానవ శరీరము అస్థిపంజరమయి యున్నది అసలు శరీరము శక్తిస్వరూపిణియగు స్త్రీ గర్భము నుండి ఉత్పత్తియగు చున్నది. గర్బోత్తత్తికనువయిన వయస్సును పొందిన స్త్రీ, పురుష సంపసర్గముచే గర్భవతియగుచున్నది. గర్భము శుక్ల శోణిత సంబంధము. 'గర్భము నిలిచిన తొడనే ఋతుస్రావమంత మగును, అప్పటినుండి దశమాసములకు శిశువు జనించును, క్రమముగ గర్భ ధారణమయిన
మొదటి మాసమున గర్భములోని పిండము ఒక క్రిమివలెనుండును. నెలదాటి రెండు నెలల లోపల తల పెద్దదగును, నేత్రములు కూడ నపుడే యేర్పడును హృదయము, దవడలు, ఎముకలు గూడ నానెలలోనే యేర్పడును, రెండు నెలల యనంతరము, స్త్రీ లేక పురుష చిహ్నము లేర్పడును. చేతులు మోచేతులు కలుగును, కండరములు, ముక్కు, కంటి రెప్పలు, నోరు, చర్మము ఇవి స్పష్టముగ నేర్పడును, మూడవ నెలలో హృదయ చలన మేర్పడును నాల్గవమాసమున శరీరావయనము లన్నియు నగుదురు. అయిదవమాసమున శిశువు యొక్క పొడవు పదునొకండు అంగుళములు మొదలు పన్నెండు అంగుళములలో వుండును. తూకమున నొక వవును వుండును. తలలో వెండ్రుకలు
మొలచును, కండ్లు మూతపడియుండును. లలాటము, భ్రూమధ్యమున సన్నని వెండ్రుకలు ఉత్పత్తియగును, ఏడు, ఎనిమిది మాసములలో పిండము లోని శిశువు సంపూర్ణ స్థితిని బొంది యభివృద్ధి జెందును. ఇట్టి యపుడు శిశువు ప్రసవమయినచో శ్వాసము వదలుటకును ఏడ్చుటకును పాలు చప్పరించుటకును సమర్ధమయియుండును.................