పుడమి ఆవేదన
భూమి నాశనమవుతున్న శకంలో మనం జీవిస్తున్నాం
లక్షల ఏళ్ల క్రితం అగ్నిపర్వతాలు, ఉల్కపాతాలు భూమిని సమూలంగా మార్చేశాయి. ఇప్పుడు మనుషులు అంతకంటే ఎక్కువ మార్పునే భూమ్మీద తీసుకొస్తున్నారు. మనుషుల ప్రభావం భూగ్రహం మీద ఎంతగా పడిందంటే, మొత్తంగా భూమి చరిత్రలో ఓ కొత్త శకమే మొదలైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనుషులంతా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారని కొందరు శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు.
భారీ వాతావరణ మార్పులను నివారించడం మనుషుల చేతిలో పనేనని, తాము ఊహించిన దానికంటే ఎక్కువ నష్టాన్నే మనుషులు పర్యావరణానికి కలిగిస్తున్నారని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన శాస్త్రవేత్తలు సైమన్ లెవిస్, మార్క్ మెస్లిన్ చెబుతారు. ప్రకృతి విపత్తులు, ఇతర సహజమైన చర్యల కంటే ఎక్కువగా మానవ చర్యల వల్లే మట్టి, రాళ్లు, ఇతర ఖనిజాలు ఉండాల్సిన చోటు నుంచి మరో చోటికి తరలిపోతున్నాయని వాళ్లంటారు.
ఏటా మనుషులు ఉత్పత్తి చేసే కాంక్రీట్తో భూమిపైన 2మి.మీ. మందంలో ఓ పొరను う ఏర్పాటు చేయొచ్చు. ప్రతి సముద్ర గర్భంలో మైక్రో ప్లాస్టిక్లు పోగైపోయి ఉన్నాయి. భూమిపైన
ఉండే చెట్లలో సగం ఎప్పుడో కొట్టేశాం. జీవజాతులు అంతరించిపోవడం అనేది చాలా
మామూలు విషయంలా మారిపోయింది.
భూమ్మీద చోటు చేసుకునే సహజమైన చర్యల కారణంగా గాల్లో నుంచి ఎంత నైట్రోజన్ దూరమవుతుందో.. ఫ్యాక్టరీలు, వ్యవసాయం కారణంగా కూడా అంతే నైట్రోజన్..............