• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vatapatrasai

Vatapatrasai By Simha Prasad

₹ 175

“షీ ఈజ్ ప్రెగ్నెంట్...”

గైనకాలజిస్ట్ మాటలకు నాలోని శక్తినంతా ఎవరో తోడేసినట్టు అయిపోయాను.

"థాంక్యూ.. థాంక్యూ వెరీ మచ్" తెచ్చిపెట్టుకున్న సంతోషంతో షేక్ హేండిచ్చారు

అమెరికన్ డాక్టర్ గనుక మొక్కుబడిగా చెప్పింది. ఇదే ఇండియాలో అయితే ఇదేదో మహత్తర సంగతైనట్టు "కంగ్రాట్యులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు" అని సంబరంగా చెప్తారు.

మెడికల్ సెంటర్లోంచి బయటపడి కారు వైపు మౌనంగా భారంగా అడుగులేస్తున్నాం.

"ఇండియా వెళ్లినప్పుడు ఖాళీ లేకుండా పెళ్ళిళ్ళకీ పుణ్యతీర్థాలకీ తిరిగేం. కాస్తంత కేర్ తీసుకునుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు" కించిత్తు నిష్టూరంగా అన్నాను సుభాష్.

"ఇంకో ఒన్ ఇయర్ దాకా చిల్డ్రన్ వద్దు. లెటజ్ స్టిక్ టు దట్" కారెక్కుతూ అన్నారు.

శరీరం ఆసాంతం సన్నగా కంపిస్తోంటే మౌనంగా ఉండిపోయాను.

కారు వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు సుభాష్.

నాకు రోడ్డేకాదు పరిసరాలూ కన్పించడం లేదు. మనసంతా గందరగోళంగా ఉంది.

"లెటజ్ గో ఫర్ అబార్షన్...” చూపులు మరల్చకుండా అన్నారు.

నేనాశించిన సమాధానం అదే. అయినా తుళ్ళి పడ్డాను. భయంగా చూశాను. నోటి తడారి పోతోంటే "ఫస్ట్ ఇష్యూ..... మంచిదేనా?” అన్నాను.

"యాఁ ప్రాక్టికల్గా ఆలోచించు. లక్కీగా నీకు ఒన్ ఇయర్ ప్రాజెక్టు వచ్చింది...... దీని కోసం చూస్తే దానికి మధ్యలోనే గుడ్ బై చెప్పాలి..... మూణెల్లకన్నా ఎక్కువ ఖాళీగా వుంటే హెచ్ఐన్స్టీకి ప్రోబ్లం వస్తుంది. వెంటనే ఇంకో ప్రాజెక్టు రాకపోతే హెచ్ఫిరికి మారాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ హెచ్ఎన్ బీ రావడం చాలా కష్టం. సో.... బేబీ కోసం చూసుకుంటే మళ్ళీ జాబ్ చేసే అవకాశం రాకపోవచ్చు. సెవెంటీ థౌజండ్ డాలర్స్ లాస్...!"

“పాయింటే. ఇన్సూరెన్సు ప్రీమియమూ ఎక్కువ పే చేయాలి. డెలివరీ చార్జెస్ ఎక్స్ట్రాగా చాలా అవుతుంది. నీకు గుర్తుందిగా. రామారి వైఫ్ డెలివరీకి ఇన్సూరెన్స్ మనీ గాక ఎయిట్ ధౌజండ్ ఎడిషనల్ ఖర్చయింది. అలాంటిది జరిగితే మన బ్యాంక్ బ్యాలెన్స్ బాగా కరిగిపోతుంది.....”

“యా.... అదీగాక డెలివరీకి మీ పేరెంట్స్ని పిలవాలి... టూ బెడ్ రూం పోర్షన్ తీసుకోవాలి.....!"...............

  • Title :Vatapatrasai
  • Author :Simha Prasad
  • Publisher :Sri Sri Prachuranalu
  • ISBN :MANIMN4874
  • Binding :Papar back
  • Published Date :Oct, 2014 first print
  • Number Of Pages :238
  • Language :Telugu
  • Availability :instock