వేదబాహ్యులు
భారతీయ తాత్విక పరంపరలో వేదాలను ప్రమాణంగా అంగీకరించని. దర్శనాలలో బౌద్ధం, జైనం, చార్వాకం, ఆజీవికము ముఖ్యమైనవి.
చార్వాకమతం
చార్వాకుడు అంటే అందమైన మాటలు (చారు-అందమైన, వాక్కు -మాటలు) చెప్పేవాడు అని అర్థం. చార్వాకుడు ఒకడు కాదు, అనేకులు. ప్రాచీన భారతదేశంలో నాస్తికవాదానికి ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక శాఖ చార్వాకమతం. వివిధ కాలాలలో ఇది బార్హస్పత్యము, లోకాయతము, వైతండికము అనే పేర్లతో పిలవబడింది. చార్వాకులు భిన్నకాలాలలో బార్హస్పత్యులు, లోకాయతులు, వైతండికులు అంటూ వివిధ నామాలతో వ్యవహరించబడ్డారు. వారందరినీ చార్వాకులుగా నేడు గుర్తిస్తున్నారు. అజితకేశకంబలి, మకలిగోశాలి, పూర్ణకాశ్యపుడు, పాయాసి, రామాయణంలో కనిపించే జాబాలి ఋషి మరియు హరివంశపురాణంలో ప్రస్తావించబడిన వేనరాజులాంటి వారు చార్వాక భావాలను ప్రచారం చేసారు. హిందూ (నైయాయిక, వేదాంత దర్శనాలు), బౌద్ధ, జైన మతాలు సైద్ధాంతికంగా చార్వాకులతో విభేదించి వారిని విమర్శించాయి.
చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణమును మాత్రమే అంగీకరించారు. ఇంద్రియములకు అందని వాటిని అంగీకరించలేదు. కొన్ని ప్రత్యక్ష ప్రమాణముకు తెలియవు. ఉదాహరణకు కొండపైన నిప్పు ఉందో లేదో చెప్పలేము. కానీ అక్కడ పైకి ఎగసే పొగ కనిపిస్తుంది. అప్పుడు ప్రత్యక్షప్రమాణముకు తెలిసే పొగను బట్టి నిప్పు ఉన్నదని ఊహ చేయవచ్చు. దీనినే అనుమానము అంటారు. పాపపుణ్యాలు, ధర్మాధర్మములు లాంటివి ఇంద్రియాలకు తెలియకున్నా వాటిని అనుమాన ప్రమాణము ఆధారముగా అంగీకరిస్తారు. జైనులు. బౌద్ధులు ప్రత్యక్షము, అనుమానము అను రెండు ప్రమాణాలను అంగీకరించారు.............