• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vedalalo Devatalu

Vedalalo Devatalu By Dr Krovi Parthasarathy

₹ 108

  1. వేదము - దేవతలు

దైవత్వం కలవారు. సమాజహితం కోరేవారు. పదిమందికీ మేలు చేసేవారు. వరాలిచ్చేవారు. మానవుల కోరికలు తీర్చేవారు. మానవులను అసురీశక్తుల (రాక్షసుల) నుండి కాపాడేవారు. దివ్యమైన ప్రకాశం కలవారు. దివ్యమైన తేజస్సుతో ప్రకాశించే వారు, లోకంలో ధర్మరక్షణ చేసేవారు. వీరు దేవతలు అనబడతారు.

దేవతలు ఎంత మంది? అన్నప్పుడు 33 కోట్లమంది అంటారు. కాని దేవతలు 33 మంది మాత్రమే అని చెబుతోంది బృహదారణ్యకోపనిషత్తు. కాని చివరకు ఒక్కరే దేవత అంటారు ఆ ఉపనిషత్తులో, దేవతను ఆరాధించటానికి ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది. రకరకాల దేవతలకు రకరకాల మంత్రాలుంటాయి. ఒకే దేవత అనేక రూపాలలో ఉంటుంది. వాటన్నింటికీ రూపాలుంటాయి.

దేవతలలో పురుష దేవతలు, స్త్రీ దేవతలు విడివిడిగా ఉన్నారు. ఈ దేవతలంతా అనిత్యులు. అశాశ్వతులు. శాశ్వతమైన వాడు పరమేశ్వరుడు. ఆయన శాస్త్రీయనామమే బ్రహ్మము.

మానవులకన్నా ఎక్కువ శక్తి గలవారు, పూజలు, స్తోత్రాలచే ప్రీతి చెందేవారు, మానవుల కోరికలు తీర్చేవారు దేవతలు. దేవతలంతా స్వర్గలోకంలో ఉంటారు. అసలు దేవతలు ముప్ఫైముగ్గురు అని బృహదారణ్యకం చెబుతోంది. ఏకాదశ రుద్రులు 11, ద్వాదశాదిత్యులు 12, అష్టవసువులు 8 ఇంద్రుడు, ప్రజాపతి వెరసి 33. ఇంత మంది దేవతలను చెప్పినప్పటికీ వేదంలో చెప్పింది ఏకేశ్వరోపాసన. 'సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనా' సాధకుని కోరికలు తీర్చటానికి అనువుగా పరమేశ్వరుడికి రూపం కల్పించబడింది. పరమేశ్వరుడే అగ్ని, ఇంద్రుడు, రుద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతున్నాడు. అతని కళ్యాణ గుణాల ఆధారంగా ఇన్ని పేర్లు రూపాలు ఏర్పడ్డాయి. ఆయుషునిచ్చేవాడు కాబట్టి అగ్ని అని, బలము వీర్యము ఇస్తాడు కాబట్టి ఇంద్రుడని, మంచివారిని రక్షిస్తాడు కాబట్టి మిత్రుడని, దుర్మార్గులను శిక్షిస్తాడు కాబట్టి వరుణుడని, దృష్టినిస్తాడు కాబట్టి సవిత, ధనాన్నిస్తాడు. కాబట్టి బ్రహ్మ ఇలా రకరకాల పేర్లతో పిలవబడి రకరకాల దేవతలు ఏర్పడ్డారు...........................

  • Title :Vedalalo Devatalu
  • Author :Dr Krovi Parthasarathy
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4693
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :86
  • Language :Telugu
  • Availability :instock