మొదటి అంకం
చాలా కాలం కిందట రకరకాల మొక్కలు, పొదలు, చెట్లు, పువ్వులు కూడిన ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవి చాలా అందంగా ఎత్తుగా, పొట్టిగా, మధ్యస్థంగా ఉండే చెట్లతో, అమృతంలా ఉండే ఫలాలతో, గలగల పారే సెలయేర్ల తో, కీటకాలు, పక్షులతో సొగసుగా స్వర్గంలా ఉండేది.
ఆ అడవిని వనరాణి పాలించేది. ఆమె చాలా పొడుగ్గా ఉండి, వెడల్పుగా, చిన్నగా ఉండే ఆకులను, రంగు రంగుల మొగ్గలను, మంచు బిందువులను సీతాకోక చిలుకలను ఆభరణాలుగా ధరించేది. ఆమె తలపై అద్భుతమైన కిరీటం ఉండేది. ఆమె అడవిని తన అదుపులో ఉంచుకునేది. అడవిలో నివసించే ప్రాణులన్నిటినీ కాపాడే బాధ్యత ఆమెది.................