• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Veera Gunnamma Kalinga Sivangi

Veera Gunnamma Kalinga Sivangi By Nalli Darmarao

₹ 100

ఆధునిక మహిళకు గున్నమ్మ ఆదర్శం

మందసా జమిందారీ రైతాంగ పోరాటం, పలాస అఖిల భారత కిసాన్ మహాసభలు, రాజపురం కాల్పులు, హరిపురంలో ఉద్యమ సన్నాహాలు - ఈ చరిత్ర నా నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఒక కోణంలో గర్వంగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం అండదండలున్న జమిందార్ను ఎదిరించే శక్తిని, చైతన్యాన్ని అందించిన కిసాన్ మహాసభలు జాతీయ స్థాయిలో జరగడం, దానికి పలాస వేదిక కావడం దేశస్వాతంత్ర్య చరిత్రలో ఓ మహత్తర ఘట్టం. గున్నమ్మ అనే ఓ పేద రైతు బిడ్డ గండ్రగొడ్డలి పట్టుకొని పోలీసులపై, అధికారులపై తిరగబడడం వెనుక ఆత్మాభిమానం అనేది ఎంత బలమైన పాత్ర పోషించిందో అర్థమవుతుంది. ఇది ఆధునిక మహిళకు ఎంతో ఆదర్శవంతమైనది. ఆమె జీవితం, త్యాగం తగిన స్థాయిలో ఏ ప్రభుత్వం గుర్తించలేదు. దీనికి కారణం సమగ్రంగా ఆనాటి పోరాటంలో ఆమెతో పాటు ప్రాణాలు కోల్పోయిన నలుగురి గురించి ఒక స్థూపం తప్ప మరేవిధమైన స్మారక కార్యక్రమం జరగలేదు. నిజానికి, రాజపురం పరిసరాల్లో ఉన్న గ్రామాల వారికే ఆ పోరాట చరిత్ర తెలియదు. గంగిరెడ్ల కళాకారులు పాడుతుంటారని విన్నాం కానీ, మాలాంటి వాళ్లకు ఆ అవకాశం రాలేదు. జర్నలిస్టు, రచయిత నల్లి ధర్మారావు 80 ఏళ్ల తర్వాత గున్నమ్మ జీవితాన్ని ప్రస్తుత తరాలకు నవల రూపంలో అందించడం అభినందనీయం.

శుభాకాంక్షలతో మీ

డాక్టర్ సీదిరి అప్పలరాజు

  • Title :Veera Gunnamma Kalinga Sivangi
  • Author :Nalli Darmarao
  • Publisher :Madhu Mass Media
  • ISBN :MANIMN4219
  • Binding :Papar back
  • Published Date :2021
  • Number Of Pages :167
  • Language :Telugu
  • Availability :instock