ఒకటి
ఒక దేశాన్ని గొప్ప దేశంగా చేసే అంశం ఏమిటి?
మనం ఒక దేశాన్ని గొప్పదేశంగా రూపొందించే అంశం గురించి మాట్లాడుకునే ముందు, మానవ వికాస పరిణామం విషయంగా జరిగిన పరిశోధనలు సాధించిన పురోగతి గురించి కొంచెం చెప్పుకోవాలి. సాంప్రదాయకంగా, దీన్ని అర్థం రెండు విభిన్న ధోరణుల్లో అర్ధం చేసుకోవచ్చు. మొదటిది, పురాతత్వ ఆధారాలు. ప్రపంచవ్యాప్తంగా మొహెంజోదారో, హరప్పా ఇంకా అటువంటి తరహా త్రవ్వకాల ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు అత్యంత కీలకమైనవి. వాటిల్లో అనేక నాగరికతల జీవన విధానాలూ, సంస్కృతులు, మూలాలూ స్పష్టీకరించబడ్డాయి.
రెండవది, ఇటీవలి కాలంలో మానవ జన్యువులు అవగాహన కోసం జరిపిన అత్యాధునిక పరిశోధనల పురోగతులు. అయితే జినోమ్ సీక్వెన్స్ (జన్యు శ్రేణుల) లో ప్రధాన భాగం మానవులందరిలోనూ సర్వసాధారణంగా సమానంగానే ఉంటుంది. కేవలం చిన్న చిన్న భాగాల్లో ఉండే చిన్న చిన్న తేడాల వల్ల మానవుల పరిణామంలో మనకి వైవిధ్యం కనబడుతుంది. దక్షిణాఫ్రికాకి చెందిన ప్రొఫెసర్ ఫిలిప్ టోబియాస్ (1925-2012) జన్యుశాస్త్రం (జెనెటిక్స్), పాలియోఆంథ్రోపాలజీ రంగాల్లో గొప్ప కృషి సల్పిన మార్గదర్శి.................