సదాశివ బ్రహ్మేంద్రస్వామి
భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టిల్లు - అద్భుతమైన యోగ రహస్యాలు తెలిసిన మహర్షులెందరో ఈ పుణ్యభూమిలో జన్మించారు. ఎన్నో సంవత్సరాలుగా భారతీయ తాత్త్విక సంపదను రక్షిస్తూనే ఉన్నారు. 'నహి జ్ఞానేక సదృశం పవిత్ర మిహ విద్యతే' అన్న భగవద్గీత సారాంశం ప్రతి అణువులో నిండి, ప్రతి నీటిబొట్టులో కలిసి భారతీయ రక్తంలో ప్రవహిస్తునే ఉంది. ప్రపంచ దేశాల్లో మరే దేశం పోటీ పడలేనంతగా ఆధ్యాత్మిక సంపదను ఈ దేశానికి అందించిన మహనీయుల జీవిత విధానాలు ఎటువంటి దారిలో నడిచాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. పూలదారి మనకు పరచి ముళ్లబాటను వారు స్వీకరించారు. సమాజం విసిరేసిన రాళ్ల దెబ్బలను, నవ్వుతూ భరించి, మన చేత తత్త్వామృతాన్ని త్రాగించారు. వారి జాడల్లో, అడుగునీడల్లో భారతీయ సంస్కృతి లక్షల సంవత్సరాల చరిత్రను నిలుపుకోగలిగింది.
'తత్త్వమంటే' ‘అదే నీవు' అనే చెప్పేది. అదేమిటో, నేనేమిటో సరిగా అర్థం చేసుకోగలిగితే మనిషి జీవన విధానం ప్రశాంతంగా సాగిపోతుంది. నిత్యం సమస్యలతో అల్లాడిపోతున్న మానవుడు తనలోని ప్రశాంతతను మరచి, కల్లోలిత ప్రపంచంలో దారులు వెతుక్కుంటున్నాడు. గొంగట్లో భోజనం చేస్తూ అడుగడుక్కి వెంట్రుకలొస్తున్నాయని బాధపడే విధానమే ఇది. మనోబలమే అన్ని సమస్యలకు పరిష్కారం. ఆ బలాన్ని అందించి, ప్రశాంతంగా ముందుకు నడవమని ప్రబోధించేవారే మహాపురుషులు. ఇంద్రియాల వలయంలో చిక్కి, దుఃఖమనే నుడిగుండలో మునుగుతున్న మానవాళికి దారి చూపే నావ లాంటి వారు ఈ
పరమహంసలు.
అంతశ్శరీరే జ్యోతిర్మయోహి శుభ్ర
యంపశ్యంతి యతః క్షీణ దోషాః
.............