తెలుగు జనాభా
తెలుగు వారి జనాభా గూర్చి ఖచ్చితమైన సంఖ్య చెప్పటం కష్టమే. కేవలం తెలుగు రాష్ట్రాలలో జనాభా సంఖ్య మాత్రమే ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో లక్షలు, కోట్లులో తెలుగు వారు నివసిస్తున్నారు కానీ ధైర్యంగా, భాషాభిమానంతో మేము తెలుగువారం అని నమోదు చేసుకునే వారు తక్కువ.
తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో తెలుగు వారు కోట్లు సంఖ్యలో వున్నారు. కానీ ఆ రాష్ట్రాలలో తెలుగు ప్రజలంటే వుండే చిన్న చూపు వల్లనేమో ఖచ్చితమైన సంఖ్య నమోదు కావటం లేదు. కానీ ఎన్నికల సమయంలో ఆ రెండు రాష్ట్రాలలోనూ కొన్ని ప్రాంతాలలో జయాప జయాలను నిర్ధేశించే శక్తి తెలుగు అందరికీ తెలుసు.
ఇక ఇతర రాష్ట్రాల్లో నివసించే తెలుగు వారు 50% మంది తాము తెలుగు వారిగా చెప్పుకోవటానికి చిన్నతనంగా భావిస్తారు. పరభాషలపై హెచ్చు మోజు కలిగివుంటారు. అదే గొప్పగా భావిస్తారు. ఇంకా మరికొన్ని కారణాల వలన తెలుగు జనాభా నమోదు తగ్గిపోతుంది. "తెలుగు స్రవంతి" అనే ఒక గ్రంథంలో యిచ్చిన లెక్కలను పరిశీలిద్దాం. క్రీ.శ.2001 జనాభా లెక్కల ప్రకారం....
రాజస్థాన్లో 6,00,000 మంది తెలుగువారుండగా 28,000 అని నమోదైంది. అలాగే అస్సాం 2,00,000 బదులు 27000లాగా, పశ్చిమ బెంగాల్లో 5 లక్షల బదులు 2,08,000, ఒరిస్సా 70,00,000కు బదులు 7,12,000, చత్తిసడ్ 50,00,000 బదులు 14,05,000, కర్నాటక 1,25,00,000 బదులుగా 36,98,000, తమిళనాడు 2,00,00,000 బదులుగా 35,27,000గా నమోదయ్యాయి. ఇంకా దేశంలో ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాలన్నిటి టా తెలుగు వారు వేలు, లక్షల సంఖ్యలో వున్నారు. దేశం మొత్తం మీద పరిశీలకుల లెక్కల ప్రకారం 14 కోట్లు 10 లక్షల పైగా వుండగా ప్రభుత్వ లెక్కలలో 7 కోట్ల.......................