సాహిత్యకారులు, అభ్యుదయ కవి, విమర్శకులు, నాటక, సినీ గేయ రచయితగా ప్రసిద్ధి గాంచిన వీరు 31 ఆగస్టు, 1925న విశాఖలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న జాతీయవాది. 'ఆనందవాణి' పత్రిక సంపాదకునిగా వ్యవహరించారు. 'త్వమేవాహం'తో వచన కవిత్వంలో కొత్త ప్రయోగాలు చేసిన వీరు 1949లో చలనచిత్రరంగంలో ప్రవేశించి పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పరిశోధన చేసిన 'సమగ్ర ఆంధ్ర సాహిత్యం ' సంపుటాలుగా 1966లో వెలువడి సాహిత్య లోకంలో వీరికి చిరస్మరణీయమైన స్థానం కల్పించాయి. విమర్శకు 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందారు. త్వమేవాహం (1949), సినీవాలి (1960), గాయాలు - గేయాలు, కూనలమ్మ పదాలు (1965), వెన్నెల వేసవి, వేమన్న వేదం (1974), ప్రజాకళలూ-ప్రగతి వాదులు, ఆరుద్ర సినీగీతాలు (1-5 సంపుటాలు) అమెరికా ఇంటింటి పజ్యాలు, రాముడికి సీత ఏమౌతుంది? గుడిలో సెక్స్, కాటమరాజు కథ, , అరబ్బీ మురబ్బాలు, హస్త లక్షణ పదాలు, శుద్ద మధ్యాక్కరలు, పైలా పచ్చీసు - కథా సంపుటాలు వెలువరించారు.
1955లో విషప్రయోగం, దేవుని ఎదుట, న్యాయాధికారి, పార్కుబెంచీ, నన్ను గురించే, దరఖాస్తు ఫారం, అక్కయ్యకి ప్రమోషన్
మొదలైనవి ఆరుద్ర నాటికలుగా వెలువడ్డాయి.