₹ 72
కలలు కనాలి అవి ముక్కలవ్వాలి. మళ్ళి అతుక్కోవాలి. కష్టాలు తెలియాలి. కన్నీళ్ళు రావాలి. ఒక అసంతృప్తి నీడలా వెంటాడాలి. ఓ ఆలోచన ఆత్మీయంగా సేద తీర్చాలి. పగిలిపోయిన కలల శకలాలు కొన్ని హృదయాన్ని గాయపరచాలి. ఓ బాధ గుండెతో నిరంతరం సంఘర్షిస్తూ ఉండాలి. ఓ నిరాశ సునామీలా బతుకునంతా చుట్టేయాలి. మనసునంటుకున్న ఓ అనుభూతి స్పర్మ.. ఉద్వేగ తరంగమై మనో దేహాలను ఆక్రమించుకోవాలి! వీటన్నింటిని నా జీవితంలోకి సమృద్ధిగా చేరవేసిన నా మిత్రులకు, విమర్శకులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు... నా పరిసరాలకు, పరిస్థితులకు.... సహకరించిన చీకటి రాత్రులకూ.... నా ఈ "వెన్నెల చివుళ్ళు".... ప్రేమతో అంకితం.
-సునీత గంగవరపు.
- Title :Vennela Chivullu
- Author :Sunitha Gangavarapu
- Publisher :Saili Publications
- ISBN :MANIMN0707
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :128
- Language :Telugu
- Availability :instock