• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vesya Matha
₹ 225

వావాదు

- శ్రీఇప్పగుంట సాయిబాబా క్షేమేంద్రుడు వైదుషీవిమర్శన ప్రాభవముకల మహాకవి. ప్రతిభకు మేరలేదు. పాండిత్యమునకు అంతులేదు. సరసరసమయకవిత్వమునకు కాణాచి. సమకాలీన సంఘమును ఇంతగా పరిశీలించి సర్వంకష రీతిలో రచనలు చేసిన స్వతంత్ర వ్యక్తిత్వము కలిగిన మహాకవి.

ప్రాయశః క్రీ.శ. 1000 నుండి 1070 వఱకు జీవించినట్లు పరిశోధకుల నిర్ణయము. తండ్రి ప్రకాశేంద్ర. తాత సింధు. అనంత కలశ రాజుల కాలంలో (1028-63; 1063-89) కశ్మీరదేశంలో సారస్వత సేవలో కడపినాడు.

ఆర్ధికపుష్టి కలిగిన కుటుంబంలో పుట్టినందువలన క్షేమేంద్రుడు ఎవరి ప్రాపకమును కోరక స్వతంత్రంగా జీవనము సాగించినాడు. తాతతండ్రులు శివభక్తి తత్పరులు. బ్రాహ్మణులపట్ల ఉదారభావములను ప్రదర్శించినట్లు మనుమడు వెల్లడించినాడు. ప్రాథమికంగా శివభక్తుడైన క్షేమేంద్రుడు తన ఆచార్యులలో ఒకడైన సోమపాదునివలన వైష్ణవమతం పుచ్చుకున్నాడు. బృహత్కథామంజరి ప్రస్తావనలో ఈ విషయం చెప్పడమే కాదు 'శ్రీమత్ భగవతాచార్య సోమపాద' అని గౌరవ - పురస్సరంగా ఉట్టంకించినాడు.

చారుచర్య చివరిలో శ్రుతిస్కృతులను విడనాడరాదని చివరివరకు విష్ణువును స్మరించవలెనని నుడివినాడు. క్షేమేంద్రుడు కవికణాభరణంలోని ద్వితీయసంధిలో 'సామ్యం సర్వసురస్తుతా' అందరు దేవతలను స్తుతించుటలో పక్షపాతము లేకుండవలెను అనుట గమనార్హము. తాను వైష్ణవుడైనను సర్వదేవతాపూజయందు మనస్సు నిలుపుట క్షేమేంద్రుని హృదయ ఔదార్యానికి మచ్చు.

తండ్రి ప్రకాశేంద్రుని వంటి గొప్ప పండితకవి వారసత్వానికి తగినవాడు క్షేమేంద్రుడు. గొప్పగొప్ప ఆచార్యులవద్ద విద్యాభ్యాసము పొందినాడు. | అభినవగుప్తుడు, రామయశుడు, దేవధరుడు మున్నగు వారు క్షేమేంద్రుని గురువులు,................

  • Title :Vesya Matha
  • Author :Dr Vaddepalli Srinivasarao
  • Publisher :Sri Vaddepalli Chinapullaiah Grandhalaya prachurana
  • ISBN :MANIMN4191
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :115
  • Language :Telugu
  • Availability :instock