వేటూరి మాటలు - వేటూరి పాటలు -
పాటంటే!
పాటంటే మాటలు కాదు. నేను విశృంఖల పద ప్రయోగం చేసినా అది పాటకు తగిన విషయం లేనపుడు శబ్దాశ్రయం, వస్తువాశ్రయం లేనపుడు, భావ ప్రగల్భానికి అవకాశం లేనపుడు మాత్రమే పదాలతో ఆడుకున్నాను. ఒక శూన్యాన్ని దాటవలసి వచ్చినపుడు శబ్ద సేతువుల్ని నిర్మించుకున్నాను. అదేవిధంగా చాలా విషయాలు చెప్పాల్సి వచ్చినపుడు శబ్దలయాలు బట్టి, అందులో ప్రతిమలుగా ఆ సన్నివేశ శిల్పాల్ని ప్రతిష్టించాను. ప్రతి పదానికీ సన్నివేశాన్ని మోసే శక్తి వుండాలి. ప్రతి అక్షరాన్నీ తన గవాక్షం లోంచి అనంత విశ్వాన్ని దర్శించగలిగే బీజశక్తి ఉండాలి.
తెలుగు పాట
"తెలుగు పాట తెలుగుతనాన్ని గుర్తు చేసేదిగా ఉండాలి. పాట రాసినవాడికి, పాడినవాడికి, విన్నవాడికి ఆత్మ సంతృప్తి కలిగించేలా ఉండాలి. మంచి పాట వింటే మనశ్శాంతి కలగాలి. అది వినకుండా ఉండలేని పరిస్థితి రావాలి. రోగాలు నయం కావాలి. కానీ, ఇవాళ నిజమైన తెలుగు పాట గ్రామాల్లోనే సజీవంగా ఉంది”. "దర్శకుడు గొప్ప సన్నివేశం చెప్పగలిగితే, మంచి పాట పుడుతుంది. కానీ, తెలుగు సినిమాలలో సన్నివేశం సెలవు తీసుకుని చాలా రోజులైంది. దాని ఫలితంగా కావ్య గౌరవాన్ని దక్కించుకునే దిశగా వెళ్తుందనిపించిన తెలుగు సినిమా పాట మళ్ళీ ఇప్పుడు మరోదారి పట్టింది.
శ్రీ వేటూరి జననీ జనకులు కీ.శే. శ్రీమతి కమలాంబా శ్రీ చంద్రశేఖరులు...........................