₹ 200
విప్లవ గాయకుడు విక్టర్ జారా 1973 సెప్టెంబర్ 15 న చీలి నిరంకుశ పాలనకి బలైపోయాడు. అతని జ్ఞాపకాలని,జీవితాన్ని, విప్లవ సంస్కృతికోద్యమాన్ని, ప్రజల పై దాని ప్రభావాన్ని వివరిస్తూ అతని భార్య జోన్ జారా , భవిష్యత్తు పై ఎంతో ఆశతో , "విక్టర్ జారా ఒక అసంపూర్ణ గీతం" అనే ఈ పుస్తకాన్ని వెలువరించింది.
చీలి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు విక్టర్ జారా విప్లవ కృషిని సమర్ధవంతంగా, ఎంతో నిబద్దతతో నిర్వహించి, ప్రజల మనిషి అనిపించుకున్నాడు. ఒక రాజకీయ భావజాల వ్యవస్థ ఎదిగి బలపడటంతో , స్థిరపడటంలో సాంస్కృతికరంగం నిర్వహించే పాత్ర ఎనలేనిది. ప్రజలని చైతన్యవంతం చేయడానికి విప్లవ సంస్కృతికోద్యమం ఎలా దోహదపడుతుందో ఈ పుస్తకం వివరిస్తుంది. ఆ ప్రజా వెల్లువ పాలకులని ఎలా భయపెడుతుందో కూడా ఇది చూపిస్తుంది.
- Title :Victor jara
- Author :Dr Nalini
- Publisher :Alakananda Prachuranalu
- ISBN :MANIMN2074
- Binding :Paerback
- Published Date :2021
- Number Of Pages :204
- Language :Telugu
- Availability :instock