అ ఒక యక్షరము. ఉభ. వై. అవ్య, 1, మఱియొకదాని లేమిని దెలిపెడి; 2. తనంతట అనునర్థమును దెలిపెడి"; 3. బొత్తిగా అనునర్థమును దెలిపెడి". సం.వి. పుం. 1.విష్ణువు; 2. బ్రహ్మ; 3. శివుఁడు. 4. కాలవిళంబము లేమిని దెలిపెడి
అంక దే. వి. 1. ప్రక్క, పార్శ్వము. 2. అణక యొక్క రూపాంతరము.
అంకగణితం . అంకెలను ఉపయోగించి లెక్కలు చేయడం, అంకెల లెక్క.
అంకచండాలం వి. రోత, మితి మీరిన అసహ్యం. అంకణము వై. వి. 1. నలుచదరపుచోటు*; 2. తొట్టికట్టు, కక్ష్య. (అది యెన్ని యంక ణముల oney?)
అంకణా వి. జమా ఖర్చుల పట్టీ, ఖాతా నిల్వల పట్టీ.
అంకనం వి. గుర్తు, చిహ్నం ముద్ర; ముద్రలు వేసే సాధనం, ముద్రలు వేయడం, ఉత్పాదక సంస్థ విశిష్టతను తెలిపే గుర్తు.
అంకపత్రం వి. అధికారముద్ర ఉన్న పత్రం. అంకపొంకములు దే. వి. బ. (అంకము + పొంకములు.) 1. కోపము; 2. విరోధము. విణ. ఉగ్రము. (చూ, అంకా పొంకములు.)
అంకము ఉభ. దే. వి. సం. 1. అంకె; 2. ఒడి; 3. గుఱుతు; 4. చోటు; 5. తప్పు; 6. నాటక పరిచ్ఛేదము; 7. నాటక భేదము; 8. భూషణము; 9. యుద్ధము; 10. సమీపము.
అంకమ్మ శోకాలు వి. బ. (వెర్రి) ఏడ్పులు, పెడబొబ్బలు
అంకమ్మసేవాలు వి. బ. పూనకం వచ్చిన వ్యక్తి వేసే గంతులు లేదా చేష్టలు, పూనకం వచ్చినట్లు వేసే గంతులు.
అంకవిద్య సం. వి. గణితము.......................