విజ్ఞానశాస్త్రం మన జీవన
సిద్ధాంతం!
“దేవుళ్లని, దయ్యాలని తయారు చేసినవాళ్లు మనుషులే. వాటిని అవసరం కోసం చేశారు. ఇప్పుడు వాటినే అడ్డుపెట్టుకుని అకృత్యాలకు పాల్పడుతున్నారు” అని అన్నారు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి. ప్రాథమికమైన వైజ్ఞానిక విషయాల్ని కొందరు అర్థం చేసుకోలేక ప్రతి విషయాన్నీ దేవుడితో ముడిపెడతారు. జరుగుతున్న ప్రతి సంఘటనా దైవ సంకల్పమే అనుకుంటారు. అది కేవలం వారి అవగాహనా రాహిత్యమే. విచక్షణతో హేతుబద్ధంగా ఆలోచించడం మొదలుపెడితే అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. జీవపరిణామం సుమారు నాలుగున్నర బిలియన్ సంవత్సరాలకు ముందు ప్రారంభమైంది. ఏకకణ జీవులు, బహుకణ జీవులుగా, సాధారణ జీవులు, సంక్లిష్టమైన జీవులుగా పరిణతి చెందుతూ ఇదిగో మన మానవ జాతి ఉద్భవించింది. ఇప్పటికీ ఇదే అత్యున్నత స్థితికి చేరిన దశ. అయితే ఇదే అంతిమ దశకాదు. జీవ పరిణామం సాగుతూనే ఉంటుంది. వాస్తవాలు ఈ విధంగా ఉంటే, వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా, మూఢ నమ్మకాల్లో బతుకుతూ పురాణాలు ప్రామాణికమైనవని అనుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం ద్వాపర యుగం 840000 సంవత్సరాలు. మనిషి అంటే హోమోసెపియన్ రూపొంది రెండు లక్షల...............