• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vijayam Anandam Mariyu Santusti Kosam 7 Manastatwalu

Vijayam Anandam Mariyu Santusti Kosam 7 Manastatwalu By Swami Mukhundananda

₹ 295

మనోదృక్పథాలు, మనస్తత్వముల యొక్క ప్రాముఖ్యత

విజయవంతమైన జీవితానికి ప్రధానంగా కావాల్సిన దేమిటి? వృత్తివ్యవహారాల్లో విజయాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని మరియు ఆంతర సుఖాన్ని ప్రసాదించే ఆ ఒక్కటీ ఏమిటి?

వీటన్నిటినీ ఇచ్చేది, డబ్బు కాదు, ఎందుకంటే, ఎంతో మంది డబ్బున్న వారు కూడా, నిరర్ధకమైన జీవితం గడుపుతూ, రోగాలతో, దుర్భరంగా ఉంటుంటారు. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు కూడా కాదు, ఎందుకంటే సమాజంలో గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఉన్న వారి పిల్లలు కూడా కొన్నిసార్లు, బాధ్యతారహిత నిర్లక్ష్యంతో, నిరర్థకమైనతిరుగుబోతుల్లా ఉంటుంటారు. గొప్ప తెలివితేటలు కూడా కాదు, ఎందుకంటే గొప్ప మేధావులు కూడా, భావావేశితంగా ఉంటుంటారు మరియు సామాజికంగా మూర్ఖత్వంతో ఉంటుంటారు. నిస్సందేహంగా ఈ సంపదలు, యోగ్యతలు విజయానికి సహకరించే విషయాలే అయినా, ఆ ఒక్క పరమావశ్యకమైన విషయం లేకపోతే, విజయం తప్పకుండా లభిస్తుంది అని చెప్పలేము.

అనుకున్నది సాధించటానికి, సంతోషానికి మరియు సంతుష్టికీ కావలసిన ప్రధానమైన పనిముట్టు, మన భావావేశాలపై నియంత్రణ. ఆంగ్లంలో 'Attitude leads to altitude.' అన్నారు; అంటే, 'మన మానసిక దృక్పథమే మన ఉన్నతికి దారితీస్తుంది' అని. భావోద్వేగాలను చక్కగా అదుపులో ఉంచుకోగలిగే నేర్పరితనం కలిగినవారే, ఎన్నో అవాంతరాలు ఎదురైనా, తమతమ వృత్తి రంగాలలో విజయం దిశగా లంఘిస్తారు. తమ ఆలోచనలు, తలంపులు ఏ విధంగా ఉండాలి అని తామే ఎంచుకునే సామర్థ్యం కలిగి ఉంటారు కాబట్టి, తమలో నమ్మకాన్ని, ఉత్సాహాన్ని నింపుకుని, ఉల్లాసంతో తమ పనులు పట్ల పూర్తి శ్రద్ధ వహిస్తారు. సంక్లిష్టమైన ప్రతికూలతలు ఎదురైనా, ఏమాత్రం తొణకకుండా, పట్టుదలతో ముందుకెళ్తుంటారు. అద్భుతమైన విజయాలతో, వీరోచిత లక్షణాలతో తమ తోటివారి కన్నా, ఎంతో ఉన్నతమైన స్థాయిని పొందుతారు. చూసే వారికి ఏదో వీరికి అదృష్టం వరించింది అనిపించవచ్చు, కానీ నిజానికి, ప్రతి సందర్భంలో కూడా, వారి ఉన్నతమైన ఆలోచనా దృక్పథమే, వారి విజయ రహస్యం.

దీనికి విరుద్ధంగా, తమ అస్తవ్యస్త ఆలోచనల్లో చిక్కుకుపోయేవారు కొందరుంటారు. పదే పదే ఆందోళన, నైరాశ్యం, కోపము మరియు ప్రతీకారేచ్చ వంటి ఆలోచనలతో తమ అమూల్యమైన సమయాన్ని, శక్తిని, వృధా చేసుకుంటారు. ఇటువంటి ప్రతికూల/నకారాత్మక (నెగెటివ్) ఆలోచనలు, వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, స్నేహితులను దూరం చేస్తాయి, మరియు వృత్తివ్యాపారాల్లో అసమర్థత కలుగ చేస్తాయి. పర్యవసానంగా, వారి మనస్సే..............

  • Title :Vijayam Anandam Mariyu Santusti Kosam 7 Manastatwalu
  • Author :Swami Mukhundananda
  • Publisher :BSC Publishares & Distributors
  • ISBN :MANIMN4157
  • Binding :Papar back
  • Published Date :2022
  • Number Of Pages :201
  • Language :Telugu
  • Availability :instock