చివరి మాట - ముందు మాట
చివరికి ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతే ఎలా వుంటుంది? అందుకే ఈ పుస్తకం ఎలా చదవాలో చెప్పదలచుకున్నాను. అలా తెలుసుకోవటం వల్ల ఒక లాభముంది. తొలివ్యాసం నుండే లాభాలు పొందగలుగుతారు. ఈ ఉదాహరణ చదవండి.
ఒక మండువేసవి సమయంలో యాత్రికుల్లో ఒకాయన మార్గం కనుక్కోలేక పోయాడు. బాగా అలసట వచ్చి, నీరసపడ్డాడు.
దాహంతో గొంతు ఎండిపోతున్నది. మంచినీళ్ళు తాగితే తప్పించి ప్రాణం నిలిచేలాలేదు. సరిగ్గా ఆ సమయంలో దూరంలో ఒక బోరింగ్ పంపు కనిపించింది. వేగంగా అడుగులువేసి ఆతృతగా పంపువైపు వెళ్ళాడు. అక్కడ ఒకగ్లాసునిండా నీరు నింపి వుంది. ఆ గ్లాసు అందుకుని నీరు తాగబోతుండగా అక్కడ బోర్డుమీద ఇలా రాసివుండటం గమనించాడు.
“ఈ గ్లాసులోని నీళ్లు ఒక ప్రత్యేకమైనవి. విశేష శక్తి కలిగినవి. నీళ్ళు తాగకు. ఈ గ్లాసు నీళ్ళను బోర్ పంపులో పోసి, బోర్కాడితే అనేక గ్లాసుల నీళ్ళు బయటకు వస్తాయి” అని ఆ బోర్డు మీద రాసుంది. అతగాడప్పుడు సందేహంలో పడ్డాడు.
“ఇప్పుడేం చేయాలి?"
ఎక్కడో భూమిలో దాగున్న అనేక గ్లాసుల నీటి కోసం ప్రస్తుతం చేతిలోవున్న గ్లాసు నీటిని వదులుకోవాలా? లేక ఆ బోర్డుమీదున్న మాటలు మరచిపోయి ఆ గ్లాసులో నీళ్ళు తాగి అక్కడినుండి వెళ్ళిపోవాలా?
కాని ఎక్కడో ఏమూలో అతని మనసులో ఆ బోర్డు మీద చెప్పిందే చేయమని అనిపించింది.
మనసు చెప్పిన మాటను నమ్మి బోరింగ్ పంపులో గ్లాసు నీరుపోసి బోరింగ్ కొట్టసాగాడు.
ఒకటి... రెండు... మూడుసార్లు కొట్టినా ఒక్క చుక్క నీరు బోర్ నుండి బయటకు రాలేదు. తనను తాను తిట్టుకోవటం మొదలు పెట్టాడు. మళ్ళీ బోరింగ్.................