“నళిని రెండు కప్పుల నిండా కాఫీ తీసుకొచ్చి ఒకటి మామగారికి, రెండోది అత్తగారికి ఇచ్చింది. మామగారు నోటి దగ్గర పెట్టుకోబోతుండగా “ఆగండి” అంది అత్తగారు. మామగారు ఆగిపోయాడు.
“ఇందులో విషంగాని కలపలేదు కదా!" కోడలి వైపు తిరిగి అంది అత్తగారు. నళిని ముఖం కందగడ్డలా మారిపోయింది. “అటువంటి కసాయిగుణం మీ సొంతం. పచ్చకామెర్ల వాళ్లకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు. అలాగ మీకందరూ కసాయివాళ్ళ లాగే కనిపిస్తా”రంటూ రుసరుసలాడుతూ వంటగదిలోనికి వెళ్ళిపోయింది నళిని.
"ఏంటే వాగుతున్నావు?” అంటూ అత్తగారు లేవబోయింది.
"అలా వాగటం ఆ మహాతల్లికి అలవాటే కదా! విషం కలిపి వుంటే హాయిగా చచ్చిపోదాంలే! తినడం, తాగడం మానేస్తే ఆకలితోనైనా చావాలి కదా!” అన్నాడు మామగారు.
"ఛీ ఛీ ఇద్దరూ ఇద్దరే, బ్రహ్మరాక్షసులు, రెండో కోడలు వస్తుంది కదా! అదెలాగూ వీళ్ళని విషం పెట్టి చంపేస్తుంది. అందరూ నాలాగ మంచి వాళ్ళుండరు కదా! నన్ను ఆడిపోసుకొన్న పాపం రాబోయే కోడలి చేతిలో పండుతుందిలే!" అనుకొంది నళిని...........................