• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Vimarshanaalokanam

Vimarshanaalokanam By Dr Ch Suseelamma M Aph D M Phil

₹ 150

నా విమర్శనాలోకనం...

                                 Criticism is the branch of study concerned with classifying, expanding, evaluating work of Literature.

                                 రాగద్వేషాలకు అతీతంగా కావ్యంలోని బాగోగులను, మంచి చెడ్డలను, అర్థాన్ని, సొగసును, లోపాలను స్పష్టంగా ఎత్తి చూపేది విమర్శ. ప్రాచీన కాలంలో సంస్కృత కావ్యాలను విశ్లేషించడాన్ని "భాష్యం చెప్పటం” అనే అనేవారు. టీకా తాత్పర్యాలను, విశేషాలను తెలియజేసేవారు.

                                  దాదాపు అన్ని ప్రక్రియల లాగే ఈనాడు మనం వ్యవహరిస్తున్న విమర్శ' కూడా ఆంగ్లం ప్రభావంతో వచ్చిందని చెప్పవచ్చు. Kritein అనే గ్రీకు పదం నుండి Criticism అనే ఆంగ్ల పదం ఏర్పడింది. దానికి సమానార్థకంగా 'విమర్శ' అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. సాధారణంగా లోకంలో విమర్శించటం అంటే ఆక్షేపించడం లేదా తిట్టడం అనే అనుకుంటారు. కానీ విమర్శ అంటే - బాగా పరిశీలించుట, పరీక్షించుట, ఆలోచించుట, చర్చించుట అనే అర్థాల్లో చెప్పవచ్చు.

                                   ఒక రచనలోని ఉచితానుచితాలు, భావ గాంభీర్యం, అలంకారిక రచనా పాటవం, పాత్ర చిత్రణ, రసపోషణ, సన్నివేశ కల్పన, శిల్ప సౌందర్యాది సత్య విషయాలను కూలంకషంగా చర్చించడం 'విమర్శ'. ఇది చాలా నేర్పుతో చేయవలసిన పని. విమర్శ అనేది రచయిత మీద కాకుండా రచన మీద ఉండాలి. పొగడ్త కాకుండా తెగడ్త కాకుండా నిష్పక్షపాతంగా ఉత్తమ సాహిత్యానికి తగిన 'ప్రేరణ' నిచ్చేదిగా ఉండాలి. పొగిడినప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి రాకపోవచ్చు, కానీ నిష్కర్షగా విమర్శించినప్పుడు విమర్శకుడు తాను చెప్పిన విషయాలకు తగిన ఆధారాలు చూపిస్తూ సమాధానం చెప్పవలసిన సందర్భం రావచ్చు అలా చెప్పటానికి తగిన సాహసం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఒకానొకచో దీర్ఘ వాదోపవాదాలకు నెరిసిద్ధమై ఉండాలి.

  • Title :Vimarshanaalokanam
  • Author :Dr Ch Suseelamma M Aph D M Phil
  • Publisher :Sri CH.Lakshminarayana Publications
  • ISBN :Vimarshanaalokanam
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :188
  • Language :Telugu
  • Availability :instock