వినియోగదారుల సంరక్షణ చట్టము, 2019 పరిచయం వినియోగదారుల సంరక్షణ చట్టం, 1986 చట్టంగా చేయబడి ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచాయి. అప్పటి నుండి ఆ చట్టంలోని నిబంధనల నిర్వహణలో ఎన్నో లోపాలు దృష్టికి వచ్చాయి. ఈ వినియోగదారుల సంరక్షణ చట్టం, 1986ను సవరించటానికి 2011వ సంవత్సరంలో ఒక బిల్లు ప్రవేశపెట్టబడింది. అయితే అప్పటికి లోక్సభ రద్దవటంతో ఆ బిల్లుకి కాలం ముగిసింది. ఈ చట్టానికి బదులుగా వినియోగదారుల సంరక్షణ బిల్లు 2015ను తీసుకురావాలని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లు స్థాయీ సంఘానికి పంపగా, వారు 2016లో తమ నివేదికను యిచ్చారు. స్థాయీ సంఘం చేసిన సిఫార్సులను పరిగణలోనికి తీసుకుని, వినియోగదారుల సంరక్షణ బిల్లు 2018 అనే కొత్తబిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ రద్దవటంతో ఈ బిల్లుకి కూడా కాలం ముగిసింది. తదనంతరం వినియోగదారుల సంరక్షణ. చట్టం 2019 లోక్సభలో ప్రవేశపెట్టబడింది. చట్టపు లక్ష్యాలు మరియు కారణాల ప్రకటన వినియోగదారుల సంరక్షణ చట్టము (1986), వినియోగదారుల ప్రయోజనములను మరింతగా రక్షించటానికి మరియు వినియోగదారుల వివాదాలను పరిష్కరించటానికిగాను వినియోగదారుల సంరక్షణ మండలులు మరియు ఇతర అథారిటీలను స్థాపించుటకును చట్టము రూపొందింది. అయితే వినియోగదారుల వివాదాల సేవాసంస్థలు చెప్పుకోదగిన మేరకు ప్రయోజనకరంగానే ఉన్నప్పటికీ, వివిధ ఆటంకముల వలన కేసులు పరిష్కారం శీఘ్రగతిని జరగటం లేదు. చట్టంలోని నిబంధనల నిర్వహణలో చాలా లోపాలు దృష్టికి వచ్చాయి.................. |