• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Viplava Parimanakrama Gatitkarkam

Viplava Parimanakrama Gatitkarkam By Y Crasin

₹ 180

అధ్యాయం 1

విప్లవ యుగ చలనశక్తి

సామాజిక పరిణామాలకు గతితర్కాన్ని వర్తింప చేసేటప్పుడు, చరిత్ర ప్రమాణ వాదం తప్పనిసరిగా అవసరం. ప్రపంచ విప్లవ పరిణామ క్రమాన్ని గురించి గతితార్కిక దృష్టితో జరిగే ఏ అధ్యయనంలోనైనా కూడా ఇది, ఇంత తప్పనిసరి గానూ అవసరం. తన సొంత చరిత్రా, సొంత పరిణామ దశలూ గల ఒక సమగ్ర విషయంగా ఈ పరిణామ క్రమాన్ని అవగాహన చేసుకోవడం అన్నదే కర్తవ్యం.

20వ శతాబ్దిలోని సామాజిక విప్లవ ఆవిర్భావం

ప్రపంచ కార్మికవర్గం చేత ప్రభావితమైన సామాజిక విప్లవం ఒక మొత్తం యుగానికంతటికీ విస్తరించింది. ఈ విప్లవ గతిక్రమంలో, అప్పుడప్పుడే అవత రిస్తూన్న కమ్యూనిస్టు సామాజిక వ్యవస్థ, రంగ నిష్క్రమణ గావిస్తూన్న పెట్టుబడిదారీ విధానంతో సహజీవనం నెరపుతూంది. ఈ రెండు సామాజిక వ్యవస్థలూ రెండు ధృవాల వంటివి. వీటి శక్తి మండలాలూ, ఇవి ఒక దానిపై ఒకటి, మానవజాతి యొక్క సామాజిక జీవితంపైన ప్రసరింపజేసే ప్రభావం యొక్క బలమూ, మారుతూ ఉంటాయి. రష్యాలో సాధించిన మొదటి విజయం ఇప్పటికప్పుడే భౌతిక ప్రపంచ పరిస్థితినీ, బూర్జువా ప్రపంచంలోని అన్ని వర్గాల, అన్ని సామాజిక సముదాయాల వైఖరులనూ ప్రగాఢంగా ప్రభావితం చేసింది. అక్టోబరు విప్లవం ఫలితంగా, "ప్రపంచం అంతా మారిపోయింది, సర్వత్రా బూర్జువావర్గం కూడా మారిపోయింది” అని లెనిన్ అన్నారు (లెనిన్, కలెక్టెడ్ వర్క్స్, సంపుటి31,పుట100).

నానాటికీ ఎక్కువ దేశాలు పెట్టుబడిదారీ విధానంతో తెగతెంపులు చేసుకొనే కొద్దీ, మొత్తం ప్రపంచ పరిస్థితిలో గుణాత్మకమైన మార్పులు కొనసాగుతూనే ఉంటాయి. కొత్త విప్లవాల్లో ఏవీ కూడా, అంతకు పూర్వపు విప్లవాలు జరిగిన సామా జిక - ఆర్థిక పరిస్థితుల్లాంటి వాటిలోనే జరగవు. అవి ఎదుర్కొన్న లాంటి శత్రుశక్తుల వ్యూహాన్నే ఇవి ఎదుర్కొనవు. హెరాక్లిటస్ చెప్పిన దానికి టీకా తాత్పర్యంగా ఒక విషయం చెప్పవచ్చు - ఒకే విప్లవ పరివర్తనా స్రవంతిలో ఎవరు కూడా రెండుసార్లు ప్రవేశించజాలరు; ఎందువల్లంటే, సామాజిక పరిసరాలూ, అసలు విప్లవ క్రమమూ కూడా నిరంతరం మారుతూ ఉంటాయి.

ప్రపంచ విప్లవ క్రమం అంటే అర్థం, కేవలం ఒకేలాంటి విప్లవాల సమాహారం. అని ఎంత మాత్రమూ కాదు. ఇది, నిర్దిష్టమైన దశలగుండా సాగుతుంది. ఈ దశల్లో ప్రతి ఒక్క దానికీ, దాని సొంత లక్షణాలు ఉంటాయి. ఈ దశలన్నీ కలసి ఒకే.................

  • Title :Viplava Parimanakrama Gatitkarkam
  • Author :Y Crasin
  • Publisher :Leptist Study Cercle
  • ISBN :MANIMN4207
  • Binding :Paerback
  • Published Date :March, 2023
  • Number Of Pages :208
  • Language :Telugu
  • Availability :instock