బాల్యం, యవ్వనం, తొలి విప్లవ కార్యకలాపాలు
నదీమిర్ ఇల్యీచ్ ఉల్వనోన్ (లెనిన్) 1870 ఏప్రిల్ 22న వోల్గా ఒడ్డున ఉన్న నిమ్బర (ఇప్పుడు ఉల్యానొవ్) పట్టణంలో జన్మించాడు. ఆయన బాల్యమూ, యవ్వనమూ ఆ రష్యన్ మహానది ఆరుబయలు ప్రదేశాలలో సిమ్బిర్న్స్, కజాన్, సమార (ఇప్పుడు కూయిషెన్) పట్టణాలలో గడిచాయి.
లెనిన్ తాత రష్యన్ ఫ్యూడల్ దాసుడైన రైతు. ఆయన నీజ్ని నావ్రొద్ గుబెర్నియాలో (జిల్లా) నివసించేవాడు. అక్కడ నుండి 1791లో ఆయన ఆగ్రహన్
బెర్నియాకు తర్వాత ఆగ్రహన్ నగరానికి పోయి అక్కడ కటిక దారిద్య్రంలో మరణించాడు. లెనిన్ తండ్రి ఇల్యా నికొలాయెవిచ్ ఉల్యానొవ్ చిన్నప్పటి నుండి దారిద్య్ర బాధ అనుభవించాడు. తన అన్న సహాయంతోనూ, అసాధారణమైన సామర్థ్యంతో కూడిన కఠిన శ్రమతోనూ ఆయన ఉన్నత విద్య పొందగలిగాడు. కజాన్ | విశ్వవిద్యాలయ పట్టభద్రుడైన తర్వాత ఆయన సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసి, తర్వాత పాఠశాలల ఇన్స్పెక్టరై, ఆ తర్వాత సిమ్హరి గుబెర్నియాలో ప్రభుత్వ పాఠశాలల డైరెక్టర్ అయ్యాడు. అభ్యుదయ భావాలుగల ఆయన సామాన్య ప్రజలలో విద్యావ్యాప్తికి చాలా కృషి చేశాడు. ఆయన గ్రామాలలో పాఠశాలలు ఏర్పాటు చేశాడు. ఉపాధ్యాయులకు సాయం చేశాడు. వోల్గా ప్రాంతంలోని నాన్ రష్యన్ ప్రజల విద్య పట్ల ఎంతో శ్రద్ధ చూపించాడు.
లెనిన్ తల్లి మరియా అలెక్సాంద్రోవ్నా ఒక వైద్యుని కూతురు. ఆమె ఇంటివద్ద చదువుకున్నది. ఆమెకు కొన్ని విదేశీ భాషలు తెలుసు. ఆమెకు సాహిత్యంలో మంచి..............