విశ్వ అగ్ని
(A Treatise on Cosmic Fire)
Volume 1
యదఙ్గ దాసు షేత్వమగ్నే భద్రం కరిష్యషి |
తవేత్ తత్ సత్య మఙ్గరః ॥ అగ్ని సూక్తం 6
ఓ అగ్నిదేవుడా! నీవు ఈ శరీరమును మాకు దానం చేసినావు. దానికి నీవే క్షేమమును కలిగించుచున్నావు. నీవు దానము చేసిన ఈ శరీరము నీవు నిలబడుట చేతనే నిలబడి ఉన్నది. ఇదే సత్యము.
ఈ శరీరము అవ్యక్తము నుండి వ్యక్తమునకు వచ్చింది. అవ్యక్తము వ్యక్తములోకి రావాలంటే ఒక్క అగ్ని తప్ప ఇంక ఏ విధానము లేదు. ఏదైనా సరే వ్యక్తస్థితిలో ఉంది అంటే ఇదంతా కూడా అవ్యక్తస్థితిలో నుండి వచ్చిందే, దీనికి కారణము అగ్ని. దీనినే మోడరన్ సైన్స్ హీట్ అంటుంది. రకరకాల పేర్లతో ఆధునిక విజ్ఞానం కూడా దీనిని ఒప్పుకుంటోంది. ప్రతి వస్తువుకి కూడా తనదైనటువంటి ఒక విశేషమైన శక్తి ఉంటుంది. శక్తి అన్నా, అగ్ని అన్నా పెద్ద తేడా లేదు. ఒకే పదానికి