దివ్య దర్శనాలు
దివ్య దర్శనాలంటే పరమాత్ముని సృష్టి వెనకాల ఉన్న పరదాలు లేని దృశ్యాలు అనంతమైన భగవానుని విభూతులే. ఇవి నాకు ఐదవ తరగతి నుండే దివ్య దర్శనాలు కలగటం ప్రారంభించాయి. భగవద్గీతలో చెప్పినట్లు ఇలా జరిగింది.
అథలా యోగినాయేవ
కులే భవతి ధీమతామ్
ఏతది దుర్లభతరరం
లోకే జన్మయదీదృశమ్ ధ్యానయోగము శ్లో॥ 42
విరాగియైన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండగనే
జ్ఞానులైన యోగుల కుటుంబములోనే జన్మించును. తిరిగి తెలియ కుండానే సాధనకు ప్రయత్నించును.
నాకు తెలియకుండానే అనేక దివ్య సంఘటనలు సంభవించాయి. కాని వీటిని బాల్యంలో మనం గ్రహించలేము. ఎవరైనా అనుభవజ్ఞులైన యోగులు వివరిస్తే తెలుస్తుంది కాని బాల్యంలో మనకు సద్గురువు ఎలా దొరుకుతాడు. గురుదేవులు నారాయణ మహర్షికి సన్నిధికి వెళ్లినాకా ఈ దర్శనాల అర్ధం చెపితే అవి దివ్య దర్శనాలు అని బోధపడ్డాయి..............