• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Viswa Veda Maha Grandham

Viswa Veda Maha Grandham By Viswa Veda Maha Grandham

₹ 775

ఏకేశ్వరుడు

: అనంత కరుణామయుడు : అపార కృపాశాలి : సర్వసృష్టికి మూలాధారుడైన, అల్లాహ్ అక్బర్ (దేవుడు పెద్దవాడు, గొప్పవాడు) యెహోవా (నిత్య జీవుడు), శివం = శాశ్వితుడు అయిన ఏకేశ్వరుడు నిరాకారుడై ఖాళీ బంతిలోని గాలివలె విశ్వమంతయూ వ్యాపించి నిద్రిస్తూ వుండెను. ఆ విధముగా లెక్కించుటకు వీలుకాని కొన్ని లక్షల సంవత్సరాలు నిద్రించిన తదుపరి తనకు మెలకువ రాగానే అదృశ్య రూపముతో విశ్వమంతయు వ్యాపించి యున్న తన శరీరరము కోటి సూర్య కాంతితో ఎర్రని గుండ్రటి ముద్దవలె విశ్వం మధ్య భాగమునకు చేరి దాని నుండి నేటి మానవాకారమువలె దిగంబర సూక్ష్మ నలుపు వర్ణ పురుషాకారం దాల్చి నిలుచుండిన తన శరీర రూప పులకరింపు నుండి మనసులోని కోర్కెతో తన రూపం నుండి దిగంబర సూక్ష్మ నీలివర్ణ స్త్రీ శరీర  రూపము ఎడమ భాగము నుండి వెలువడెను. (అర్ధనారీశ్వర రూపం ఇచ్చటనే) ఈ ఇరువురు నేటి సూర్యోదయమునకు చీకటికి మధ్యమంలోగల వెలుతురువలే వుండు స్థిరమైన ఆ వెలుతురులోనే ఒకరిని ఒకరు చూచుకొనుచూ.. ఆనంద పరవశంలో తేలియాడుచూ వారి ఇష్టమొచ్చి నట్లుగా కాలిక్రింద ఆధారములేని ఈ విశ్వమం తయు సంచరిస్తూ సరస వినోద శృంగారకేళిలో మునిగి తేలుతూ కొన్ని వేల సంవత్సరాలు గడిపిన తరువాత వారి ఆనంద పరవశం నుండి ఖాళీ బంతివలె స్థిర వెలుతురులో వున్న ఈ విశ్వములో ఒక స్థిర అగ్ని మండలం తదుపరి సంచార అతి నీలవర్ణ మండలం ఏర్పడెను. వీటి ద్వారా ఇప్పటివరకు వున్న స్థిర వెలుతురు సమ యం నిర్దేశించడానికి వీలులేని రాత్రి మరియు పగలుగా మార్పు చెందెను. ఆనంద పరవశంలో తేలియాడుచున్న ఈశ్వరుడు, ఈశ్వరిణి వారి ఆనందాన్ని అలాగే మరికొన్ని వేల సంవత్సరాలు కొనసాగిస్తూ వుండగా వారి నుండి ఈ విశ్వములో మరో రెండు గ్రహాలు ఒకటి అతి శీతల మండలం, తదుపరి అతి వాయువు మండలం ఏర్పడెను. ఆనందపరవశంలో తేలియాడుతున్న ఈశ్వరుడు, ఈశ్వరిణి అతి శీతల మండ లంపై అతి వాయువు మండలంపైకి వెళ్లి వారి ఆటపాటల, దాగుడు మూతల చిలిపిచేష్టల ఆనందపరవశంలో మునిగి తేలుతూ మరికొన్ని వేల సంవత్సరాలు గడిపేట ప్పటికి ఈ విశ్వములో మరొక గ్రహము ఏర్పడెను...................

  • Title :Viswa Veda Maha Grandham
  • Author :Viswa Veda Maha Grandham
  • Publisher :Viswa Veda Maha Grandham
  • ISBN :MANIMN5359
  • Binding :Hard Binding
  • Published Date :Feb, 2024
  • Number Of Pages :629
  • Language :Telugu
  • Availability :instock