| విశ్వబ్రాహ్మణ షట్చక్రవర్తులు : కృతజ్ఞతలు
విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్వర్యంలో పండిత బ్రహ్మశ్రీ గానాల రామమూర్తిగారి 124వ జయంతి కార్యక్రమం అధ్యక్షులు బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మాచార్యులు గారి అధ్యక్షతన జరిగిన సందర్భంలో చాలామంది విశ్వబ్రాహ్మణ మహాశయులకు గానాల వారి జీవితచరిత్ర తెలియకపోవటం నాకు బాధ కలిగించింది. విశ్వబ్రాహ్మణ జాతిని ఉద్దరించేందుకు జన్మించిన కారణజన్ములు రామమూర్తిగారు...!. ఆనాడు నేను అనుకున్నాను పండిత గానాల రామమూర్తి గారి జీవితచరిత్ర వ్రాయాలని. ఆ ఆలోచన వచ్చిన వెంటనే బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మాచార్యులు గారితో చెప్పాను. వారు వెంటనే స్పందించి మీరు వ్రాయండి నేను ముద్రణగావిస్తానని వాగ్దానంచేశారు. ఆ తదుపరి మరికొంత మంది జీవితచరిత్రలను కలిపి పుస్తకరూపంలో ముద్రిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే ఈ విషయం కూడా వారిముందుంచాను. వారు తప్పక వ్రాయండి అని భరోసా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను.
నేను బ్రహ్మశ్రీ గానాల రామమూర్తిగారితో పాటు బ్రహ్మశ్రీ యలవర్తి అంజనేయశాస్త్రి, బ్రహ్మశ్రీ కొమ్మూరి బాలబ్రహ్మానంద భాగవతార్, బ్రహ్మశ్రీ యర్రోజు మాధవాచారి, బ్రహ్మశ్రీ నందిపాటి వీరాచారి, బ్రహ్మశ్రీ రావూరి భరద్వాజ గార్ల సంక్షిప్త జీవితచరిత్రలను వ్రాసి విశ్వబ్రాహ్మణులకు అందచేయాలని సంకల్పించి "విశ్వబ్రాహ్మణ షట్చక్రవర్తులు" అనే పేరుతో పుస్తకం వ్రాయడానికి పూనుకున్నాను. ఆ ప్రయత్నంలో నాకు తెలిసిన సమాచారం కాక, మరి కొందరు పెద్దల వద్ద నుంచి సమాచారం, పూర్వాపరాలు సేకరించాను. పండిత గానాల రామమూర్తిగారి గురించి సమాచారం అందించిన విభావసు ఫణిదపు ప్రభాకరశర్మ గారికి (ఒంగోలు), డాక్టర్ రాపాక ఏకాంబరాచార్యులు గారికి (హైదరాబాద్), మద్రాసులోని చెన్నపురి తెలుగు విశ్వకర్మ సమాజం మాజీ కోశాధికారి శ్రీ అడ్డగుల రాజేశ్వరరావు గారికి, పండిత యలవర్తి ఆంజనేయశాస్త్రి గారి గురించి సమాచారం అందించిన విభావసు పండిత ఫణిదపు ప్రభాకరశర్మగారికి, హరికథా శిఖామణి బ్రహ్మశ్రీ కొమ్మూరి బాలబ్రహ్మానంద భాగవతార్ గారి గురించి సమాచారం అందించిన కీ.శే. నాగశ్రీ గారికి విద్యారణ్య యర్రోజు మాధవాచారి గారి గురించి సమాచారం అందించిన విశ్వకవి అత్తలూరి నాగభూషణం...............