• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Vivaham Chalam Sahityam Navalalu

Vivaham Chalam Sahityam Navalalu By Chalam

₹ 100

వివాహం

తమ్ముడు రామ్మూర్తి చచ్చిపోయినాడని వినగానే డిఫ్టీ కలెక్టరు వెంకన్నగారి మనసుకి చాలా విశ్రాంతి కలిగిందిగాని, రామ్మూర్తి సంసారా నికి దిక్కులేక పోవడమూ, తనే బాధ్యత వహించి తీరాలి కొంత కాలమన్నా అనే సందేహమూ అతని కా చావు పూర్తిగా రుచించకుండా చేశాయి. చిన్నప్పణ్ణించీ రామ్మూర్తి పెంకివాడు. తన మనసుకి తోచాయనే గాని, తను చేసే పనులవల్ల చుట్టుపక్కల వాళ్ళకి యేం కష్టం కలుగుతుందో అని

ఆలోచించే మనిషి కాడు.

రామ్మూర్తి స్వతంత్ర వ్యక్తి కావడానికి వీల్లేదనీ, గడియారంలో చక్రంవలె సంఘంలో భాగమనీ, స్వతంత్రమని పేరుపెట్టి, తక్కిన చక్రాలకి ఎదురు తిరగడానికి హక్కులేదనీ, ఎన్ని సంగతులు వెంకన్న పంతులు చెప్పినా విన్నాడు కాదు రామ్మూర్తి. దానికితోడు అతనికి సంఘ సంస్కరణం పిచ్చి పట్టి తరువాత ఇంపాసిబిల్” అయినాడు. అతను తన తమ్ముడని చెప్పు కోవడమే నామర్దాగా వుండేది, మర్యాదస్తుడు వెంకన్న పంతులుకి. రామ్మూర్తికి ఏం సంస్కరణ చేద్దామా అనే విచారం కలిగింది. వితంతు వివాహం చెయ్యాలంటే ముసలితల్లినెవరూ పెళ్ళి చేసుకునేట్టు లేరు. ఆ.............

  • Title :Vivaham Chalam Sahityam Navalalu
  • Author :Chalam
  • Publisher :Amaravti Publications
  • ISBN :MANIMN6103
  • Binding :Papar Back
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :104
  • Language :Telugu
  • Availability :instock