• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Vontu ( Bhavodvega Kathalu)

Vontu ( Bhavodvega Kathalu) By Jillella Balaji

₹ 120

మరోసారి మీతో...

కథా ప్రియులకు నమస్కారం!

నా ఈ రెండవ కథల సంపుటి విడుదల సందర్భంగా మిమ్మల్ని మరోసారి ఇలా పలకరించటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నది. నా మొదటి కథల సంపుటి 'సెక్కెంటిక' పై మీరు చూపించిన అపారమైన అభిమానం, ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అది విడుదలై మూడేండ్లు కావస్తున్నా ఇప్పటికీ మీరు ఆ కథలపై ప్రశంసా జల్లులు కురిపిస్తూనే ఉన్నారంటే... 'పర్వాలేదు. నేనూ అంతో ఇంతో బాగానే కథలు రాశానన్న మాట. నలుగురూ మెచ్చే విధంగా నా కథలు ఉన్నాయన్న మాట.' అన్న విశ్వాసం క్రమంగా నాలో వేళ్లూనుకుంటున్నాయి.

అంతేకాదు, ఆ 'సిక్కెంటిక' పుస్తకానికి రెండు పురస్కారాలు (గురజాడ కథా పురస్కారం(కడప), కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం(చిత్తూరు)) లభించటం నేను గర్వించే విషయమే అయినప్పటికీ... దాంతో నేను విర్రవీగటమో అహంకారంతో, తలెగరెయ్యటమో చెయ్యలేదు. ఒద్దికగా నేలమీద నిలబడ్డానికే ఇష్టపడుతున్నాను.

నా మొదటి కథల పుస్తకం ఇచ్చిన సంతృప్తినీ, ఆత్మవిశ్వాసాన్నీ అవలోకన చేసుకున్నప్పుడు... 'కథ' పట్ల నాకున్న ఇష్టమూ, వ్యామోహమూ నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. దాంతో నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు... కథ నాకొక ప్రాపంచిక పరిశీలనా పనిముట్టుగానూ, వాస్తవాన్వేషణకై పైపైకి నడిపించే పడికట్టుగానూ, వ్యక్తిగత పరి పక్వతకు సాయపడే ఉపకరణంగానూ, సాహిత్య సేద్యానికి పనికొచ్చే పరికరంగానూ ఉన్నాయని గ్రహించగలిగాను.

'కథ'- ఒక కళాత్మకమైన అభివ్యక్తీకరణ ప్రక్రియ. అందుకే, నాలో చెలరేగే భావ పరంపరను, ఉవ్వెత్తున ఎగసిపడే బాధాతప్త కెరటాలను దాని చట్రంలో ఇమిడ్చి పదుగురి ముందుకు తీసుకెళ్లటం నాకిష్టమైన వ్యాపకంగా మార్చుకున్నాను.

సమాజంలో ప్రస్తుతం తెర ముందుకొస్తున్న, తెగ ముంచుకొస్తున్న ఆధునిక ఉపద్రవాల్ని ఉపేక్షించటమూ, భరించటమూ అంత మంచి కాదు. దాన్ని పరిష్కరించు కోవటమే ఉన్నతమైన పద్ధతి. కానీ, ఆధునిక జీవితాల్లో ఎదురయ్యే సంఘర్షణలకు, సంక్లిష్టతలకు పరిష్కార మార్గాలు పరిమితం. వాటి అన్వేషణలో... గుండె ద్రవించి ఎన్నో భావోద్వేగాలకు గురికావలసి వచ్చింది. కనులు స్రవించి కన్నీటి పంద్రంలో ఈదులాడవలసి వచ్చింది. దాన్నుండి గట్టెక్కి, చేజిక్కించుకున్న ముత్తెపు ఫలితాల్ని పరులకు పంచేందుకు 'కథ' నాకొక దిక్సూచిగా, మార్గదర్శిగా ఉపకరిస్తోంది.

అలా మీకు పంచేందుకు వెలువరిస్తున్న ఈ కథలన్నీ ఒకే విధమైన.....................

  • Title :Vontu ( Bhavodvega Kathalu)
  • Author :Jillella Balaji
  • Publisher :Parvati Viswam Prachuranalu, Tirupati
  • ISBN :MANIMN6127
  • Binding :Papar Back
  • Published Date :Aug, 2016
  • Number Of Pages :144
  • Language :Telugu
  • Availability :instock