వృత్తి, ఉద్యోగ, వ్యాపార రహస్యములు. మన భారతదేశంలోనూ మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వారి వారి స్థానిక వనరులకు అనుగుణముగా వారి వారి జీవన విధానమును కొనసాగిస్తుంటారు. జీవనస్రవంతిలో కొందరికి వ్యవసాయ భూములు వారి వారి వంశపారం పర్యంగా ఉంటాయి. కొందరైతే వీరి వద్ద కూలిపనిచేసి జీవిస్తారు. మరికొందరైతే మహా నగరములలో ఉద్యోగముచేసి జీవిస్తుంటారు లేదా వ్యాపారం చేసి జీవిస్తుంటారు. ఈనాటి ప్రపంచంలో జీవిత పోరాటంలో స్త్రీ పురుషులు అనే భేదం లేకుండా ఉద్యోగం, వ్యాపారం లేక యంత్ర పరిశ్రమలనుండి రాకెట్ ప్రయోగశాలల వరకు జీవన ఉపాధిని స్వయంకృషితో సాగిస్తున్నారు. ఈపోటి ఉద్యోగం లేక వ్యాపారం ద్వారా ధనం సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం. జీవన ఉపాధికి ధనం మూలం. ఈ మూలాధరమైన ధనమును సమకూర్చుకోవడానికి అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మన ప్రభుత్వం కూడా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించలేకపోతున్నది. కనుక జాతకుల జీవనస్రవంతిలో ఎలా జీవిస్తారని నిర్ధారించాలంటే కృష్ణమూర్తి గారి నక్షత్ర సిద్ధాంతమును అనుసరించి జ్యోతిష్యుడు ప్రతివారికి ఆమెకు / అతడికి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలను ఈ కంప్యూటర్ యుగంలో తెలియజేయాలంటే, కృష్ణమూర్తి పద్ధతి నియమాలను పాటించినచో సరియైన ఫలితములు నిర్ణయించవచ్చు. శ్రీ కృష్ణమూర్తి పద్ధతి (K.P. System) తేలికైనది చాలా సరళమైనది. ప్రతిఒక్కరూ ఏదోవిధముగా సమాజములో గుర్తింపబడాలని, తద్వారా సమాజంలో హోదా, గౌరవం సంపాదించాలని లేక జీవనోపాధి పొందాలనో ప్రయత్నిస్తుంటారు. ప్రతివారి జాతక చక్రములో పదవస్థానము జీవనఉపాధిని సూచించుటకు చాలా ముఖ్యమైనది. ఈ స్థానము వారి జీవనోపాధి గురించి తెలియజేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ద్వారా వచ్చే సంపదలను గురించి తెలియజేస్తుంది. 10వ, 2వ మరియు 6వ, 7వ, యొక్క స్థానములు వ్యక్తి యొక్క ప్రాపంచికమైన స్థాయిని, నవనీతపరిచే విషయాలు, గౌరవించదగిన సంపాదన గురించి తెలియజేస్తుంది. 10వ భావము వ్యాపారము వృత్తి లేక ఉద్యోగము తద్వారా సమాజములో ఆ వ్యక్తి స్థాయిని గురించి యజేస్తుంది. 6వ భావము ఉద్యోగము, సేవ, తద్వారా ఆమెకు / అతడికి వచ్చే సంపాదన, సదుపాయాలు, వనరులు మొదలైన విషయాలను తెలియజేస్తుంది, మరియు వ్యక్తి యొక్క సంపాదించిన బట్టి సమాజములోస్థాయి, స్థానం తద్వారా కలిగే గౌరవాలను తెలియ పరుస్తుంది.................... |