తెలుగు అయితేనేం, మరో భాష అయితేనేం. ఏ రచయిత సృష్టిలో అయినా, పాత్రలు ఆంటోగనిస్టులు, ప్రొటాగనిస్టులు అని రెండు రకాలుగా ఉంటాయి...! మరో మాటలో చెప్పాలంటే 'మంచివాళ్ళు చెడ్డవాళ్ళు'గా అన్నమాట. లేదంటే ఒక్కోసారి ప్రధానపాత్రకి 'విధి' విలన్ అవుతుంది. కానీ ఉమా మహేష్ కథల్లో అన్ని పాత్రలు మంచితనంతో పరిమళిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం ఊహించలేనంత మంచివి..!
ఇటువంటి పాత్రల మధ్య ఘర్షణ గాని, ట్విస్ట్ గాని, క్లైమాక్స్ గానీ అల్లటం చాలా కష్టమైన పని. ఒకటి రెండు కథలు ఇలా వ్రాయగలమేమో కానీ దాదాపు ప్రతి కథలోనూ ఈ ఉదాత్తత కనబడుతుంది. ఆ ప్రక్రియలో ఈ రచయిత చాలా గొప్ప విజయం సాధించాడు.
ఎప్పుడో ఒక చిన్న కథ చదివాను. “ఒకటి మంచిది. ఒకటి చెడ్డది. నాలో రెండు తోడేళ్లు ఎప్పుడూ దెబ్బలాడుకుంటూ ఉంటాయిరా” అంటాడు ఒక ఆఫ్రికన్ ట్రైబ్ ముసలాడు తన మనవడితో.
"ఏది గెలుస్తుంది తాతా?" ఉత్సుకంగా అడుగుతాడు ఆ కుర్రవాడు.
దూరంగా కొండల మీద పెరిగిన దట్టమైన అరణ్యం కేసి అభావంగా చూస్తూ ఆ ముసలివాడు "నేను దేనికి ఆహారం వేస్తే అది" అంటాడు. చాలా గొప్ప
ఈ రచయిత తన కథల్లో చెడు పాత్రలకి పిసరంతయినా ఆహారం వేయడు. పాత్ర పోషణలో ఉన్న శిల్పం వల్ల అయితేనేం, సంఘటనల వర్ణనలో నిబిడీకృతమైన శైలి వల్ల అయితేనేం, ఈ కథలు చదవటం పూర్తి అయ్యేసరికి, కనీసం ఐదారుసార్లు..............................